BREAKING
కానిస్టేబుళ్లదే కీలక పాత్ర.. ప్రజలతో మర్యాదగా మెలగాలి బాల న్యాయ వ్యవస్థపై పోలీసులకు అవగాహన పోరంకి–కానూరుకు రూ.34.92 కోట్ల అభివృద్ధి పనులు.. తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు...జనతా పరివార్ పార్టీ అభ్యర్థుల ప్రకటన అభివృద్ధిని చూసి వైసీపీకి కడుపుమంట.. అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌.. రూ.5 లక్షల సొత్తు, రెండు కార్లు స్వాధీనం ఇంట్లో ఇనుపరాడ్‌తో భార్యపై దాడి మేయర్‌గా బొండా సిద్ధార్థకు అవకాశం కల్పించాలి వైభవంగా విజయవాడ ఉత్సవ్–2.. జాతీయస్థాయి కుంగ్ ఫూ కరాటే పోటీల్లో శ్రీ సత్య విద్యానికేతన్ విద్యార్థుల ప్రతిభ. గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి పల్లె పండుగ 3.0తో పల్లెలకు మహర్దశ - పి.గన్నవరంలో రూ.4.30 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గిడ్డి శంకుస్థాపన పత్తి రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తెకు ఎమ్మెల్సీ పదవి? తండ్రి అడుగుజాడల్లో తనయుడు.. జక్కంపూడి రాజా సేవా స్ఫూర్తి

సర్ రద్దు చేయాలని డిమాండ్

Select Suryaa Now
సర్ రద్దు చేయాలని డిమాండ్

కార్యాచరణపై  అఖిల పక్షం సమావేశం.

పెనుబల్లి సూర్య మేజర్ న్యూస్....
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుని అక్రమంగా తొలగించే ప్రక్రియను, ఎస్ ఐ ఆర్ ను రద్దు చేయాలన్న డిమాండ్ తో మండలంలోని అఖిలపక్ష నాయకులు ఏకమయ్యారు. పెనుబల్లి మండలం విఎం బంజర గ్రామంలోని సప్తపది ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ మండల  అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు అధ్యక్షతన సిపిఎం, సిపిఐ, ఎల్ మాస్ లైన్ పార్టీ  ఆదివారం సమావేశం నిర్వహించారు. భారత రాజ్యాంగం పై విశ్వాసం లేని బీజేపీ ప్రభుత్వం చేపట్టే పౌరుల ఓటుహక్కును తొలగించే ప్రయత్నాలను అడ్డుకోవాలని అఖిలపక్ష నాయకులు పిలుపునందించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా డిమాండ్ ని నాయకులు వినిపించారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( సర్) కు వ్యతిరేకంగా అక్టోబర్ 6న కలెక్టరేట్ కార్యక్రమం ముందు ధర్నాతో పాటు అక్టోబరు 8 న చలో రాజ భవన్ , నవంబరు  ఒకటిన చలో ఢిల్లీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని నాయకులు కోరారు.  కాంగ్రెస్ పార్టీ నాయకులు పంది వెంకటేశ్వరరావు, కీసర శ్రీనివాస్ రెడ్డి, ఈడ కమలాకర్, గూడూరు మాధవరెడ్డి, మాలోతు రాధాకృష్ణ, వంగ గిరిజాపతి, వంగ చంద్రశేఖర్, మేక తొట్టి కాంతయ్య, మల్లెల శ్రీనివాసరావు, మల్లెల రాజా, తెల్లూరు శేఖర్, సీపీఐ ( ఎం), సీపీఐ, ఎం ఎల్ మాస్ లైన్ నాయకులు  చలమాల విఠల్ రావు, నల్లమల ప్రతాప్, పొదిల భాస్కర్, బీరెల్లి లాజర్, కాటినేని శ్రీనివాసరావు, చిట్టిమోదుల కృష్ణ,  తదితరులు పాల్గొన్నారు.