తండ్రి అడుగుజాడల్లో తనయుడు.. జక్కంపూడి రాజా సేవా స్ఫూర్తి
కడియం లో ఘనంగా జక్కంపూడి రాజా జన్మదిన వేడుకలు..
కడియం ,మేజర్ న్యూస్ :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు, రాజానగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా జన్మదిన వేడుకలను కడియపు సావరం వైఎస్సార్‌సీపీ నాయకులు సాపిరెడ్డి కామేష్, జ్యోతుల అర్జున్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజా అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాడాల చక్రవర్తి పాల్గొన్నారు. జక్కంపూడి రాజా జన్మదినాన్ని పురస్కరించుకుని కడియం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బిస్కెట్లు, జ్యూస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.
రోగుల ఆరోగ్యం, త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం కడియపు సావరంలో యువత, పార్టీ నాయకులు కేక్ కట్ చేసి జక్కంపూడి రాజా జన్మదిన వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజా సేవకు ప్రాధాన్యతనిస్తూ, తండ్రి జక్కంపూడి రామ్మోహన్‌రావు అడుగుజాడల్లో రాజా ముందుకు సాగుతున్నారని అన్నారు. ప్రజల సమస్యలపై స్పందిస్తూ, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండే నాయకుడిగా రాజా గుర్తింపు పొందారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆకుల సుధాకర్, నాగిరెడ్డి మోహన్, జ్యోతుల వీరబాబు, చిలుకూరి రామకృష్ణ, కొక్కిరాల వెంకటేశ్వరరావు, పడాల శివ, దేవరకొండ జాను, బాలం వాసు, దుంగాల గౌరీశేఖర్, జ్యోతుల గణేష్, మణి తదితరులు పాల్గొన్నారు.