BREAKING
శీతాకాల విమాన సర్వీసుల వేళ నవీ ముంబై ఎయిర్‌‌పోర్ట్ బహుళ రవాణా అనుసంధానం విస్తరణ కోనసీమ పోలీస్ శాఖలో నూతన డాగ్ కెన్నెల్ ప్రారంభం.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధం కావాలి :జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్.. అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి.. కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్.. నో యువర్ లీడర్’ సమనస జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని భవ్య శ్రీ.. పరిమళ ప్రసాదం కొరత తీర్చేందుకు మెగా ప్రాజెక్టు ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. 17వ డివిజన్‌లో అదరగొట్టిన ఫ్లాష్ మాబ్స్.. - విజయవాడ ఉత్సవ్ 2.0కు విస్తృత ప్రచారం ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తిస్థాయిలో పరిష్కరించాలి సాంప్రదాయ విలువలను భావితరాలకు అందించాలి : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ దసరా విశేష సేవల ఆన్‌లైన్ టికెట్లు విడుదల దసరా ఏర్పాట్లపై దేవాదాయ కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన పేద కుటుంబాలకు అండగా నిలుస్తాం.. సమాజ సేవకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి బీసీలకు న్యాయం జరిగేలా రిజర్వేషన్లు నేటి రాశి ఫలాలు: 6 అక్టోబర్ 2026 (మంగళవారం)

పరిశుభ్రతలో ప్రతిభ.. అవార్డుల్లో ప్రతిష్ఠ!

Select Suryaa Now
పరిశుభ్రతలో ప్రతిభ.. అవార్డుల్లో ప్రతిష్ఠ!

ఎన్‌టీఆర్ జిల్లాకు 69 జిల్లాస్థాయి పుర‌స్కారాలు

ఘ‌నంగా అవార్డుల ప్ర‌దానోత్స‌వ కార్య‌క్ర‌మం

విజయవాడ,  మేజర్ న్యూస్ : విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర జిల్లాస్థాయి పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. స్వచ్ఛ మునిసిపాలిటీలు, గ్రామపంచాయతీలు, గ్రామ సంస్థలు,  పాఠశాలలు,  అంగన్‌వాడీలు, ఆసుపత్రులు, వసతిగృహాలు తదితర విభాగాల్లో ఎన్‌టీఆర్ జిల్లాకు మొత్తం 69 పురస్కారాలు లభించాయి. 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్, ఎమ్మెల్సీ వర్ల రామయ్య, జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర విజేతలకు అవార్డులు అందజేసి అభినందించారు. జిల్లా కలెక్టరేట్, వీఎంసీ ప్రధాన కార్యాలయం స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాలుగా, తిరువూరు మునిసిపాలిటీ స్వచ్ఛ మునిసిపాలిటీగా అవార్డులు సాధించగా, గండ్రాయి, మైలవరం, గూడవల్లి, జూపూడి గ్రామపంచాయతీలు కూడా పురస్కారాలు పొందాయి. వ్యర్థాల నిర్వహణలో అత్యుత్తమ సంస్థగా సిసిర ఎలిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అవార్డు దక్కించుకుంది. ఈ సందర్భంగా లంకా దినకర్ మాట్లాడుతూ పరిశుభ్రతతోనే ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ, సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతాయని అన్నారు. ఎమ్మెల్సీ వర్ల రామయ్య మాట్లాడుతూ స్వచ్ఛతను ప్రజా ఉద్యమంగా మార్చేందుకు ప్రతి కుటుంబం, పాఠశాల, సంస్థ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యంతో పాటు సానుకూల ఆలోచనలు, బాధ్యతాయుత ప్రవర్తనకు దోహదపడతాయని, ఎన్‌టీఆర్ జిల్లాను స్వచ్ఛతలో రాష్ట్రానికి ఆదర్శంగా నిలపాలని పిలుపునిచ్చారు. వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ 69 అవార్డుల స్ఫూర్తితో వచ్చే ఏడాది 100 పురస్కారాలు సాధించేలా కృషి చేద్దామని అన్నారు. కార్య‌క్ర‌మంలో డీపీవో టి.సీతామ‌హాల‌క్ష్మి, జెడ్‌పీ సీఈవో జె.అరుణ‌, వీఎంసీ అడిషనల్ కమిషనర్లు ఎ.ర‌వీంద్ర‌రావు, కె.శ‌కుంత‌ల‌, చీఫ్ ఇంజనీర్ పి.సత్యకుమారి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సీహెచ్ నిర్మల గ్లోరీ, డిప్యూటీ కమిషనర్ జి.సృజన త‌దిత‌రుల‌తో పాటు జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.