BREAKING
జాతీయ కబడ్డీ పోటీలకు కాసాని అకాడమీ క్రీడాకారిణులు* *నీరజ, నిషా ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు* అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ జీవిత బీమా అందించాలి: ఎల్లంపేట మున్సిపల్ చైర్మన్ లావుడియా శ్రీదేవి రమేష్ పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీయాలి డీఈవో ఎల్ సుధాకర్ డిసెంబర్ 9,10 తేదీల్లో కర్నూలు బాలోత్సవం పిల్లలు కేవలం చదువుకే పరిమిత కాకుండా ఆటలు సాంస్కృతిక అంశాల పైన కూడా మక్కువ పెంచాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్ సుధాకర్ తల్లిదండ్రులను కోరారు . బాలోత్సవ ఉత్సవాలో నిర్వహించే పోటీలలో పిల్లల్లో దాగీ ఉ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా మల్లాపూర్‌లో పాస్టర్లకు దుస్తుల పంపిణీ మిస్ యూనివర్స్ 2026 కిరీటం కైవసం.. చరిత్ర సృష్టించిన జెన్నిఫర్ బారెట్టో భక్తి, భావోద్వేగాల మేళవింపుతో 'హరివరాసనం' టీజర్ విడుదల.. మకరవిళక్కున థియేటర్లలోకి రేచింతలలో నూతన విద్యుత్తు లైన్ ప్రారంభం కోడుమూరు సర్పంచ్ బరిలో హైకోర్టు న్యాయవాది సోమశేఖర్ యాదవ్ కొండపేటలో ఇంటింటి ప్రచారం.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమని హామీ గ్రామ అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలు సహించరు.. ఉప సర్పంచ్ అనంతప్ప కళ్యాణ్ దుర్గం పట్టణంలో ఎనిమిదో వార్డులో వీధి దీపాల ఏర్పాటు. గ్రామపంచాయతీ తొలి దశ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఆదేశించారు రోడ్డు ప్రమాదంలో గాయపడిన రామకృష్ణ ముదిరాజ్‌కు శుభ ప్రద్ పటేల్ పరామర్శ 54వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల వేదికపై విజయ్ సేతుపతి మెరుపులు పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం తాండూరు క్రీడాకారులను ప్రోత్సహిస్తాం : ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి

విద్యార్థుల భవిష్యత్తుకు విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరం: చామకూర మల్లారెడ్డి

Select Suryaa Now
విద్యార్థుల భవిష్యత్తుకు విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరం: చామకూర మల్లారెడ్డి

కీసర, మేజర్ న్యూస్:విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆకాంక్షించారు. కీసర సర్కిల్ పరిధిలోని కుందన్‌పల్లిలో ఉన్న సీఎంఆర్ స్కూల్‌లో నిర్వహించిన ఖేల్ మహోత్సవ్ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్రీడా జ్యోతిని వెలిగించి ఘనంగా ప్రారంభించారు. బుధవారం  జరిగిన సందర్భం విద్యార్థులు నిర్వహించిన ఆకర్షణీయమైన మార్చ్‌పాస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థుల క్రమశిక్షణ, ఉత్సాహం, ప్రతిభను చూసి మల్లారెడ్డి అభినందించారు. అనంతరం ముఖ్య అతిధి మాట్లాడుతూ.. విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడా రంగంలోనూ అద్భుతంగా రాణించాలని సూచించారు. క్రీడలు కేవలం వినోదానికే పరిమితం కావని, శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. సీఎంఆర్ విద్యాసంస్థలు విద్యతో పాటు క్రీడలకు కూడా ఎప్పుడూ పెద్దపీట వేస్తాయని తెలిపారు. చిన్ననాటి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకుని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.విద్యార్థులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే మల్లారెడ్డి ఈ కార్యక్రమంలో తనదైన శైలిలో విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా డాన్స్ చేసి వారిలో మరింత జోష్ నింపారు. ఆయన డాన్స్‌తో విద్యార్థులు, ఉపాధ్యాయులు కేరింతలు కొట్టారు. విద్యార్థులతో కలిసిపోయి వారిని ఉత్సాహపరిచిన ఆయన తీరు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఖేల్ మహోత్సవ్‌లో భాగంగా బాస్కెట్‌బాల్, వాలీబాల్, స్కేటింగ్, రన్నింగ్ తదితర క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నారు. కార్యక్రమంలో  సీఎంఆర్ విద్యాసంస్థల డైరెక్టర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రదాన పాత్ర పోషించిన వారిలో బీఆర్ఎస్ నాయకులు కందాడి శ్రీకాంత్ రెడ్డి, గుర్రం శ్రీధర్ రెడ్డి, జలాల్ పురం సుధాకర్ రెడ్డి, నాయకపు సుధాకర్ రెడ్డి, చినింగని బాల్ రాజ్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.