BREAKING
8వ మహా పడిపూజకు ఆర్. కృష్ణయ్యకు ఆహ్వానం ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే లక్ష్యం. కోట వీధిలో డ్రైనేజీ పనులు. వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి హరివరాసనం విశ్వమోహనం: శబరిమల ఆధ్యాత్మిక గీతం వెనుక విశేషాలు, వివాదాలు ఆధ్యాత్మిక సంస్కృతికి ప్రతీకలుగా సింహద్వారాలు: ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్* ముంబైలో జరుగుతున్న 3వ ప్రపంచ మేయర్ల సమావేశంలో ‘సర్క్యులర్ సిటీస్’ అనే అంశంపై కీలక ఉపన్యాసం చేసిన స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌. -- *జాతీయస్థాయి అండర్ 14 స్కూల్ గేమ్స్ కరాటే పోటీలకు టి .లక్షిత్ కిషోర్ ఎంపిక* -- *కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్ సుధాకర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన స్కూల్ గేమ్స్ కార్యదర్శులు లక్ష్మయ్య, అరుణకుమారి* ఆస్కార్ బరిలో 'రామాయణ' సత్తా.. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ టాప్-20 జాబితాలో చోటు జాతీయ కబడ్డీ పోటీలకు కాసాని అకాడమీ క్రీడాకారిణులు* *నీరజ, నిషా ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు* అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ జీవిత బీమా అందించాలి: ఎల్లంపేట మున్సిపల్ చైర్మన్ లావుడియా శ్రీదేవి రమేష్ పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీయాలి డీఈవో ఎల్ సుధాకర్ డిసెంబర్ 9,10 తేదీల్లో కర్నూలు బాలోత్సవం పిల్లలు కేవలం చదువుకే పరిమిత కాకుండా ఆటలు సాంస్కృతిక అంశాల పైన కూడా మక్కువ పెంచాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్ సుధాకర్ తల్లిదండ్రులను కోరారు . బాలోత్సవ ఉత్సవాలో నిర్వహించే పోటీలలో పిల్లల్లో దాగీ ఉ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా మల్లాపూర్‌లో పాస్టర్లకు దుస్తుల పంపిణీ మిస్ యూనివర్స్ 2026 కిరీటం కైవసం.. చరిత్ర సృష్టించిన జెన్నిఫర్ బారెట్టో భక్తి, భావోద్వేగాల మేళవింపుతో 'హరివరాసనం' టీజర్ విడుదల.. మకరవిళక్కున థియేటర్లలోకి రేచింతలలో నూతన విద్యుత్తు లైన్ ప్రారంభం

తాండూరు క్రీడాకారులను ప్రోత్సహిస్తాం : ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి

Select Suryaa Now
తాండూరు క్రీడాకారులను ప్రోత్సహిస్తాం : ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి

యాలాల, మేజర్ న్యూస్: గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహిస్తూ,వారి ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తామని శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా గ్రామీణ క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ ప్రతిభావంతులైన క్రీడాకారులకు అండగా నిలుస్తామని తెలిపారు.యాలాల మండలం తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన మైలారం సంతోష్ కుమార్ ఇటీవల హైదరాబాద్ స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-19 పరుగు పందెం పోటీల్లో 5 కిలోమీటర్ల విభాగంలో బంగారు పతకం, 3 కిలోమీటర్ల విభాగంలో కాంస్య పతకం సాధించాడు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి పట్నం మహేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది విద్యార్థులు, యువతలో అపారమైన క్రీడా నైపుణ్యం దాగి ఉందని,వారికి సరైన ప్రోత్సాహం అందిస్తే ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉందన్నారు. తమ విద్యాసంస్థల ద్వారా కూడా క్రీడాకారులను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు అండగా నిలుస్తూ రాష్ట్ర,జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.తాండూరు ప్రాంత క్రీడాకారులకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, సంతోష్ కుమార్ భవిష్యత్తులో మరిన్ని పరుగు పందెం పోటీల్లో విజయం సాధించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సంతోష్ కుమార్ తండ్రి రామప్ప,గ్రామస్తులు అంజయ్య,నవీన్,రాము,తుల్జారాం, నరసింహులు,మల్లేష్,రాజు తదితరులు పాల్గొన్నారు.