రోడ్డు ప్రమాదంలో గాయపడిన రామకృష్ణ ముదిరాజ్‌కు శుభ ప్రద్ పటేల్ పరామర్శ
యాలాల, మేజర్ న్యూస్: మండలం కోకట్ గ్రామ యువ నాయకుడు రామకృష్ణ ముదిరాజ్‌ను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు,న్యాయవాది,బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభ ప్రద్ పటేల్ పరామర్శించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన రామకృష్ణ ముదిరాజ్ హైదరాబాద్‌లోని ఒలివ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ సందర్భంగా ఆసుపత్రికి వెళ్లిన శుభ ప్రద్ పటేల్ వైద్యులతో మాట్లాడి రామకృష్ణ ముదిరాజ్ ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న చికిత్స,కోలుకుంటున్న తీరుపై వివరాలు తెలుసుకున్నారు.అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.రామకృష్ణ ముదిరాజ్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజల మధ్యకు రావాలని శుభ ప్రద్ పటేల్ ఆకాంక్షించారు.ఆయన త్వరితగతిన కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించారు.