ఐదు రోజులుగా అదృశ్యమైన యువకుడు బావిలో మృతదేహంగా లభ్యం
బంట్వారం, మేజర్ న్యూస్: మండల పరిధిలోని బోపునారం గ్రామానికి చెందిన యువకుడు ఐదు రోజులుగా కనిపించకుండా పోయి, బుధవారం గ్రామ శివారులోని వ్యవసాయబావిలో పొలానికి నీరు పెట్టడానికి వెళ్ళిన వ్యక్తికి మృతదేహం కనిపించడంతో ఆయన పోలీసులకు, గ్రామస్తులకు సమాచారం అందించారు. పోలీసుల, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి . గ్రామానికి చెందిన బేగరి శివకుమార్ (23) గత ఐదు రోజులుగా కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు అతడి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. అతడికి మతిస్థిమితం సరిగా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి తల్లి యాదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పుండ్లిక్ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేసినట్లు పోలీసులు తెలిపారు.