BREAKING
తాండూరు క్రీడాకారులను ప్రోత్సహిస్తాం : ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఎన్నికల విధులను పి ఓ లు బాధ్యతాయుతంగా, అప్రమత్తతతో నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ 8 కేజీల గజ్జెలతో శ్రద్ధా కపూర్ కఠిన సాధన.. గాయమైనా వెనకడుగు వేయని నటి విద్యార్థుల భవిష్యత్తుకు విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరం: చామకూర మల్లారెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టిడిపి కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ధర్మతేజ. ఐదు రోజులుగా అదృశ్యమైన యువకుడు బావిలో మృతదేహంగా లభ్యం గ్రామ పంచాయతీ ఎన్నికల లో ఓటు హక్కు వినోయోగించుకొనే ఓటర్లకు పోలింగ్ కేంద్రాలలో అన్ని సదుపాయాలు కల్పించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి. నందమూరి తేజస్విని తొలి నిర్మాణ చిత్రం షూటింగ్ ప్రారంభం.. హీరో ఎవరంటే స్పెయిన్ కానరీ దీవులకు ఒకే రోజులో 2,100 మందికి పైగా వలసదారులు.. ఆల్-టైమ్ రికార్డు!: కలెక్టరేట్ గ్రంథాలయానికి 50 పుస్తకాలు విరాళం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసిన భూమా కిషోర్ రెడ్డి కుర్దిస్థాన్ సరిహద్దుల్లో ఇరాక్ సైన్యానికి అధికారాలు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు: ఊటీ మైనపు బొమ్మల మ్యూజియంలో సీఎం విజయ్ విగ్రహం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డిప్యూటీ మేయర్ టి. స్వాతి తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను మరియు బాపట్ల మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి

తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను మరియు బాపట్ల మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి

Select Suryaa Now
తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను మరియు బాపట్ల మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి

బాపట్ల, మేజర్‌న్యూస్‌ :

జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను మరియు బాపట్ల మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి  తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని పి జి ఆర్ ఎస్ హాల్ నందు ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ విధానం, ఓట్ల లెక్కింపు, భద్రతా చర్యలు, ఓటర్లకు అందుబాటులో ఉన్న సదుపాయాలపై వివరించేందుకు పాత్రికేయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి మాట్లాడుతూ, జిల్లాలో ఈనెల 26వ తేదీన తొలి దశ గ్రామపంచాయతీ మరియు మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. గ్రామ పంచాయితీ ఎన్నికలు 6 మండలాల పరిధిలో  ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.తొలి విడతలో 6 మండలాల పరిధిలో మొత్తం 95 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటిలో 29 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయని,మిగిలిన 66 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. మొత్తం 970 వార్డులకు గాను 452 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 518 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఈ పోలింగ్ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని,  మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుందని ఆయన చెప్పారు.

ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లినప్పుడు సర్పంచ్ ఎన్నికకు పింక్ రంగు బ్యాలెట్ పేపర్, వార్డు సభ్యుని ఎన్నికకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్ అందజేస్తారని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు. బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థికి ఎదురుగా నిర్దేశించిన గుర్తుపై మాత్రమే ఓటు ముద్ర వేయాలని ఆయన చెప్పారు. సంతకం చేయడం, పేరు రాయడం, వేలిముద్ర వేయడం, ఓటరు గుర్తింపు కార్డు నంబర్ లేదా ఫోన్ నంబర్ రాయడం వంటివి చేయరాదన్నారు. అలా చేసినట్లయితే  ఓటు చెల్లకుండా పోయే అవకాశం ఉందని ఆయన చెప్పారు.ఏకగ్రీవమైన వార్డుల్లో వార్డు సభ్యుడి ఎన్నికకు పోలింగ్ ఉండదని, ఆయా ప్రాంతాల్లో సర్పంచ్ ఎన్నికకు మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. అందువల్ల ఓటర్లు తమకు అందించిన ఓటరు స్లిప్‌లోని వివరాలను పరిశీలించుకోవాలన్నారు.

పోలింగ్ కేంద్రాల సంఖ్యను అవసరానికి అనుగుణంగా ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు పునర్వ్యవస్థీకరించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి  తెలిపారు. వార్డుల ఎన్నికలు ఏకగ్రీవం కావడంతో కొన్ని పోలింగ్ కేంద్రాలను విలీనం చేసి, గతంలో ఉన్న 659 కేంద్రాల సంఖ్యను 649కు సర్దుబాటు చేసినట్లు వివరించారు. ఓటర్లు ఓటరు స్లిప్‌తో పాటు ఎన్నికల సంఘం అనుమతించిన ఇతర గుర్తింపు కార్డులను తీసుకువెళ్లాలని ఆయన తెలిపారు.
పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు మాత్రమే జరుగుతున్నాందున ఓటర్లు ఉదయమే తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.ఎన్నికల నిర్వహణ కోసం 649 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,885 మంది ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించామని, వారికి అవసరమైన శిక్షణ కూడా అందించినట్లు ఆయన తెలిపారు.పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక రిటర్నింగ్ అధికారిని నియమించినట్లు వివరించారు. పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను నిర్దేశించిన కౌంటింగ్ కేంద్రానికి తరలించి, అక్కడ కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్ల ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు చేపడతారని ఆయన తెలిపారు. ఓట్ల లెక్కింపు అనంతరం సర్పంచ్ తో పాటు వార్డు సభ్యుల ఫలితాలను ప్రకటిస్తామని ఆయన తెలిపారు.అనంతరం నిబంధనల ప్రకారం ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తామని, ఇందుకు వార్డు సభ్యుల కోరం 50 శాతం ఉండాలని ఆయన చెప్పారు. ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తయిన తర్వాత ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని ఆయన తెలిపారు.మొత్తం 78 ప్రాంతాలను సున్నిత, అత్యంత సున్నిత ప్రాంతాలుగా గుర్తించి అక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు తెలిపారు.

బాపట్ల మున్సిపాలిటీ పరిధిలో పునర్వ్యవస్థీకరణ అనంతరం 44 వార్డులు ఉన్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు.చైర్‌పర్సన్ పదవికి 15 మంది అభ్యర్థులు, వార్డు సభ్యుల స్థానాలకు 149 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని ఆయన తెలిపారు. పట్టణ పరిధిలో 8 ప్రాంతాలను సున్నిత, అత్యంత సున్నిత ప్రాంతాలుగా గుర్తించినట్లు ఆయన చెప్పారు.మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ల జాబితాలు, వార్డులు, పోలింగ్ కేంద్రాల్లో మార్పులు జరిగిన నేపథ్యంలో ఓటర్లు తమ ఓటు ఎక్కడ ఉందో ముందుగానే పరిశీలించుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు.ఎన్నికల ప్రచార గడువు ముగిసినందున ప్రచార కార్యక్రమాలకు అనుమతి లేదని, ఎన్నికల నిబంధనల ప్రకారం అవసరమైన తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పట్టణంలోకి వచ్చే, వెళ్లే మార్గాల్లో బారికేడ్లు, నిఘా బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్‌ల ద్వారా తనిఖీలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు.

ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, ఎన్నికల పరిశీలకులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి  తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, అదనపు పోలీసు సిబ్బందిని స్ట్రైకింగ్ ఫోర్స్, క్విక్ రెస్పాన్స్ టీమ్‌లకు అనుసంధానం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎక్కడైనా సమస్యలు సృష్టించడం, ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయకుండా ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఫిర్యాదుల కోసం జిల్లా, ఆర్డీఓ స్థాయి కంట్రోల్ రూమ్ నంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.ప్రజలు, రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఎన్నికల సిబ్బంది సహకరించి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు తోడ్పడాలని, ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో వారితోపాటు జిల్లా పంచాయతీ అధికారిని నగేష్ కుమారి, బాపట్ల మున్సిపల్ కమిషనర్ హాసిని పాల్గొన్నారు.