ఎన్నికల విధులను పి ఓ లు బాధ్యతాయుతంగా, అప్రమత్తతతో నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
కారంచేడు, మేజర్‌న్యూస్ :
ఎన్నికల విధులు నిర్వహించే పి ఓ లు బాధ్యతాయుతంగా, అప్రమత్తతతో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్,వి., పేర్కొన్నారు.,
రెండవ సాధారణ స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 26వ తేదీ (గురువారం) జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి బుధవారం కారంచేడు మండల కేంద్రంలోని ప్రైవేటు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధులు నిర్వహించే పి ఓ లు బాధ్యతాయుతంగా, అప్రమత్తతతో విధులు నిర్వహించాలని పి ఓ లను ఆదేశించారు,ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బందికి విధుల నిర్వహణ పై దిశానిర్దేశం చేశారు.ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఎన్నికల విధులకు హాజరైన ప్రిసైడింగ్ అధికారులు (పీఓలు), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీఓలు), ఇతర పోలింగ్ అధికారులు (ఓపీఓలు)తో మాట్లాడారు. ఎన్నికల విధుల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలు, పోలింగ్ ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలపై వారికి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా, అప్రమత్తతతో నిర్వహించి, పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని సూచించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ఎన్నికల విధులకు హాజరైన సిబ్బందితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బందితో మమేకమై వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
జిల్లా కలెక్టర్ వెంట చీరాల రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. నరసింహారావు, తహశీల్దార్ మాధవిలత, ఎంపీడీఓ కె. నేతాజీ, పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు తదితరులు ఉన్నారు.