నందమూరి తేజస్విని తొలి నిర్మాణ చిత్రం షూటింగ్ ప్రారంభం.. హీరో ఎవరంటే
సూర్య ఎంటర్టైన్మెంట్ డెస్క్: నందమూరి బాలకృష్ణ కుమార్తె నందమూరి తేజస్విని నిర్మాతగా తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇప్పటికే తన తండ్రి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన తేజస్విని, ఆ తర్వాత ప్రకటనల రంగంలోనూ ఆకట్టుకున్నారు. ఇప్పుడు సొంతంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టి ప్రేక్షకుల ముందుకు కొత్త కథా చిత్రాన్ని తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రాజెక్ట్‌లో యువ హీరో నాగ అన్వేష్ ప్రధాన పాత్రలో నటిస్తుండటం సినీ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.
ఈ చిత్రానికి భువన్ దర్శకత్వం వహిస్తున్నారు. కథా బలం ఉన్న విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇందులో నాగ అన్వేష్‌తో పాటు మరొక యువ హీరో కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. వైజాగ్‌లోని అందమైన లొకేషన్లలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది.
బాలనటుడిగా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు చిత్రంతో గుర్తింపు పొందిన నాగ అన్వేష్, ఆ తర్వాత వినవయ్యా రామయ్య, ఏంజెల్ వంటి సినిమాలతో ప్రేక్షకులకు చేరువయ్యారు. కొంత విరామం తర్వాత ఆయన మళ్లీ పూర్తిస్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ ప్రాజెక్ట్ తన కెరీర్లో కీలకంగా నిలుస్తుందని భావిస్తున్నారు.
కంటెంట్ ఆధారిత చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా ద్వారా నందమూరి తేజస్విని నిర్మాతగా ఎలాంటి విజయాన్ని అందుకుంటారనే దానిపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. వైజాగ్ షెడ్యూల్‌తో మొదలైన ఈ చిత్రానికి సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక బృంద వివరాలను చిత్ర యూనిట్ త్వరలో అధికారికంగా వెల్లడించనుంది.
Also Read: ఊటీ మైనపు బొమ్మల మ్యూజియంలో సీఎం విజయ్ విగ్రహం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు