కలెక్టరేట్ గ్రంథాలయానికి 50 పుస్తకాలు విరాళం
బాపట్ల, మేజర్‌న్యూస్ :
ప్రతి ఒక్కరిలో పఠనాసక్తిని పెంపొందించి విజ్ఞానాన్ని అందరికీ చేరువ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి., చొరవ తీసుకున్నారు. కలెక్టర్ పిలుపు మేరకు స్పందించి జిల్లా యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు, పలువురు దాతలు ముందుకు వచ్చి స్వచ్చందగా పుస్తకాలను అందిస్తున్నారు. డి.బి.వి. సూర్య
నారాయణ,విజయవాడ నుండి జిల్లా కలెక్టర్ పేరు తో పోస్టు ద్వారా 15 పుస్తకాల ను జిల్లా కలెక్టరేట్ గ్రంధాలయానికి పంపడం జరిగింది.
బుధవారం పుస్తకాలను అందించిన వారిలో జిల్లా కో-ఆపరేటివ్ జూనియర్ ఇన్‌స్పెక్టర్ ఏ. సౌజన్య, పిట్టలవానిపాలెం గ్రంథాలయ అధికారి మోర్ల శ్రీనివాసరావు, డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ దాసరి శ్రీనివాసరావు, ఆర్‌డబ్ల్యూఎస్ జిల్లా మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అధికారి సీహెచ్. సాయి శిల్ప, బాపట్ల సంఘమిత్ర ఆక్వా ల్యాబ్‌కు చెందిన కే. మౌనిక, అమరావతి ఏపీ జేఏసీ అధ్యక్షుడు సురేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర సెక్రటరీ జనరల్ పి. రజిని, బాపట్ల జిల్లా అమరావతి ఏపీ జేఏసీ మహిళా విభాగం సభ్యులు ఉన్నారు.