BREAKING
పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం తాండూరు క్రీడాకారులను ప్రోత్సహిస్తాం : ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఎన్నికల విధులను పి ఓ లు బాధ్యతాయుతంగా, అప్రమత్తతతో నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ 8 కేజీల గజ్జెలతో శ్రద్ధా కపూర్ కఠిన సాధన.. గాయమైనా వెనకడుగు వేయని నటి విద్యార్థుల భవిష్యత్తుకు విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరం: చామకూర మల్లారెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టిడిపి కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ధర్మతేజ. ఐదు రోజులుగా అదృశ్యమైన యువకుడు బావిలో మృతదేహంగా లభ్యం గ్రామ పంచాయతీ ఎన్నికల లో ఓటు హక్కు వినోయోగించుకొనే ఓటర్లకు పోలింగ్ కేంద్రాలలో అన్ని సదుపాయాలు కల్పించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి. నందమూరి తేజస్విని తొలి నిర్మాణ చిత్రం షూటింగ్ ప్రారంభం.. హీరో ఎవరంటే స్పెయిన్ కానరీ దీవులకు ఒకే రోజులో 2,100 మందికి పైగా వలసదారులు.. ఆల్-టైమ్ రికార్డు!: కలెక్టరేట్ గ్రంథాలయానికి 50 పుస్తకాలు విరాళం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసిన భూమా కిషోర్ రెడ్డి కుర్దిస్థాన్ సరిహద్దుల్లో ఇరాక్ సైన్యానికి అధికారాలు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు: ఊటీ మైనపు బొమ్మల మ్యూజియంలో సీఎం విజయ్ విగ్రహం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డిప్యూటీ మేయర్ టి. స్వాతి

గ్రామ పంచాయతీ ఎన్నికల లో ఓటు హక్కు వినోయోగించుకొనే ఓటర్లకు పోలింగ్ కేంద్రాలలో అన్ని సదుపాయాలు కల్పించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి.

Select Suryaa Now
గ్రామ పంచాయతీ ఎన్నికల లో ఓటు హక్కు వినోయోగించుకొనే  ఓటర్లకు పోలింగ్ కేంద్రాలలో అన్ని  సదుపాయాలు కల్పించాలి  : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి.

కారంచేడు, మేజర్‌న్యూస్‌  :

 గ్రామ పంచాయతీ ఎన్నికల లో ఓటు హక్కు వినోయోగించుకొనే  ఓటర్లకు పోలింగ్ కేంద్రాలలో అన్ని  సదుపాయాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్,వి., పేర్కొన్నారు. బుధవారం కారంచేడు మండలం దగ్గుబాడు గ్రామంలోని మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన 12 పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి. పరిశీలించారు. ఈ సందర్భంగా రెండవ సాధారణ స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా  నేడు  జరగనున్న పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కారంచేడు మండలం, దగ్గుబాడు గ్రామం నందు ఏర్పాటు చేసిన  పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, ఫర్నిచర్, ర్యాంపులు వంటి సదుపాయాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. వృద్ధులు, దివ్యాంగ ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని, పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలుచోటుచేసుకోకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆనంతరం దగ్గుబాడు గ్రామం మండల ప్రజా పరిషత్, పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన సందర్భంగా అక్కడ ఉన్న ఓటర్ల తో కలెక్టర్ మాట్లాడుతూ మీ పేరు ఓటర్ జాబితాలో మీ పేరు ఉందా చూచుకున్నారా,ఓటర్ స్లిప్స్ ఇచ్చారని మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని మీరు అందరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని వారికి సూచించారు.

జిల్లా కలెక్టర్ వెంట చీరాల, రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్.నరసింహా రావు, తహశీల్దార్ మాధవి లత,, ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి, వీఆర్వోలు తదితరులు ఉన్నారు.