రెడ్‌క్రాస్ డైరెక్టర్‌గా* కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి
అడ్డగూడూరు: అక్టోబరు 6 మేజర్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండలంలోని చౌల్లరామారం గ్రామానికి చెందిన కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ యాదాద్రి జిల్లా మేనేజింగ్ డైరెక్టర్‌గా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అనురాగ్ జయంతి ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ రెడ్‌క్రాస్ సేవలను సమాజ సేవలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు.