పోలీసు విధుల్లో క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరి - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
సూర్య, ఆదిలాబాద్: పోలీసు సిబ్బంది క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తూ విధులను నిజాయితీగా నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. శనివారం ఆదిలాబాద్ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన పరేడ్‌లో పాల్గొన్న ఆయన సిబ్బంది యూనిఫామ్‌ను పరిశీలించారు.