BREAKING
పూల సోయగాలతో పల్లెల్లో బతుకమ్మ సందడి! స్థానిక ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించాలి. జాయింట్ కలెక్టర్ గోవిందరావు అంబటి మురళీకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన వట్టిప్రోలు రంగారావు పప్పుధాన్యాలలో ఆత్మనిర్భరత దిశగా అడుగులు - దసరా సెలవుల నేపథ్యంలో జిల్లాలోని సముద్రతీరాలకు వచ్చే పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయం అద్దంకి రాజీవ్ కాలనీలో పోలీసుల 'కార్డన్ సెర్చ్'.. కలపను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు పాకల బీచ్‌లో పెను విషాదం.. సముద్ర అలలకు ఇద్దరు బలి! వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్రను జనబాహుళ్యంలోకి తీసుకెళ్లాలి : జనా ప్రసాద్ పిలుపు ఇంద్రకీలాద్రి పై కనకదుర్గమ్మ దసరా సంబరం కుక్కల సూరమ్మ చిత్రపటానికి బీజేపీ నాయకుల ఘన నివాళులు రైజ్ లో నేడు ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు డివిస్ కంపెనీల ఉద్యోగాలు సాధించిన ఎస్ ఎస్ ఎస్ డిగ్రీ కళాశాల విద్యార్థులు జగ్గయ్యపేట అభివృద్ధికి రూ.15 కోట్లతో HAM గ్రాంటు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్

శ్రీ కృష్ణ హాస్పిటల్ లో ఉచిత వైద్య శిబిరం

Select Suryaa Now
శ్రీ కృష్ణ హాస్పిటల్ లో ఉచిత వైద్య శిబిరం

ఏలూరు, మేజర్ న్యూస్: స్థానిక ఆర్ ఆర్ పేట బెండపూడివారి వీధి లోని శ్రీ కృష్ణ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ&ట్రామాకేర్ నందు శనివారం ఉదయం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో  హాస్పిటల్స్ అధినేత డాక్టర్ బి. కృష్ణ రోగులను పరిక్షించి అవసరం అయిన వారికి ఎక్సరే, రక్త పరీక్షలు బియమ్ డి (ఎముకల సాంద్రత), స్కానింగ్ చేసి రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం పలు ఆరోగ్య సమస్యలకు సూచనలు అందజేశారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో వందలాది మంది రోగులకు సేవలందించారు. ఈ సందర్బంగా డాక్టర్ బి. కృష్ణ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అని తలచి వైద్యం ప్రతి పేదవానికి సత్వరమే అందుబాటులో ఉండాలనే మంచి ఉద్దేశ్యం కలిగి వారి తండ్రిగారైన రాముడు నుండి ప్రేరణ పొంది గత 48 నెలల(నాలుగు సంవత్సరాల)నుండి ప్రతి నెల 2 వ శనివారం పేదలకు ఉచిత వైద్య శిబిరం  నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిన్న పిల్లలను జంక్ ఫుడ్ కు దూరంగా ఉంచాలని, స్వయంగా ఇంట్లో వండిన వంటకాలను వారికి అలవాటు చేయాలని తెలిపారు. ఏలూరు చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకునే రోగుల సంఖ్య ప్రతినెలా పెరుగుతూ వస్తోందని చెప్పారు.  రోగులకు ఉచితంగా మందుల కిట్లను పంపిణీ చేశారు.  ఈకార్యక్రమంలో డాక్టర్ రవి కిరణ్, డాక్టర్ దిలిప్, లయన్స్ క్లబ్ వారు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 144మంది రోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు.

 రిపోర్టర్ దొరబాబు ఏలూరు ఏలూరు జిల్లా