BREAKING
పూల సోయగాలతో పల్లెల్లో బతుకమ్మ సందడి! స్థానిక ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించాలి. జాయింట్ కలెక్టర్ గోవిందరావు అంబటి మురళీకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన వట్టిప్రోలు రంగారావు పప్పుధాన్యాలలో ఆత్మనిర్భరత దిశగా అడుగులు - దసరా సెలవుల నేపథ్యంలో జిల్లాలోని సముద్రతీరాలకు వచ్చే పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయం అద్దంకి రాజీవ్ కాలనీలో పోలీసుల 'కార్డన్ సెర్చ్'.. కలపను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు పాకల బీచ్‌లో పెను విషాదం.. సముద్ర అలలకు ఇద్దరు బలి! వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్రను జనబాహుళ్యంలోకి తీసుకెళ్లాలి : జనా ప్రసాద్ పిలుపు ఇంద్రకీలాద్రి పై కనకదుర్గమ్మ దసరా సంబరం కుక్కల సూరమ్మ చిత్రపటానికి బీజేపీ నాయకుల ఘన నివాళులు రైజ్ లో నేడు ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు డివిస్ కంపెనీల ఉద్యోగాలు సాధించిన ఎస్ ఎస్ ఎస్ డిగ్రీ కళాశాల విద్యార్థులు జగ్గయ్యపేట అభివృద్ధికి రూ.15 కోట్లతో HAM గ్రాంటు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్

బీసీల రాజకీయ ప్రాతినిధ్యంలో రాజీ లేదు: స్థానిక సంస్థల్లో 34 శాతం టిక్కెట్లు బీసీలకే – టీడీపీ చారిత్రక నిబద్ధత

Select Suryaa Now
బీసీల రాజకీయ ప్రాతినిధ్యంలో రాజీ లేదు: స్థానిక సంస్థల్లో 34 శాతం టిక్కెట్లు బీసీలకే – టీడీపీ చారిత్రక నిబద్ధత

బాపట్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీసీల రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక సాధికారతపై తెలుగుదేశం పార్టీ తీసుకున్న చారిత్రక నిర్ణయాలను నాయకులు ఘనంగా కొనియాడారు.
ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ:
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే బీసీలకు వెన్నెముకగా నిలిచింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పూర్తిస్థాయిలో 34 శాతం సీట్లు కేటాయించాలనే చారిత్రక నిర్ణయం టీడీపీ నిబద్ధతకు నిదర్శనం.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి హామీ: బీసీలకు సామాజిక న్యాయం చేయడంలో, వారిని రాజకీయంగా ఉన్నత స్థానాల్లో నిలబెట్టడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకంజ వేసే ప్రసక్తే లేదని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్పష్టమైన హామీకి పార్టీ కట్టుబడి ఉంది.
పార్టీ అధిష్టానం పిలుపు మేరకు బాపట్ల నియోజకవర్గం మరియు జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి బీసీలను ఏకం చేస్తూ విస్తృత ప్రచార, ప్రజా సమీకరణ కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహించనున్నాం.
నామినేటెడ్ పదవుల నుంచి చట్టసభలు, స్థానిక సంస్థల వరకు బీసీలకు సముచిత ప్రాధాన్యత కల్పించే ఏకైక పార్టీ తెలుగుదేశం అని నేతలు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ బీసీ విభాగం అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల, పట్టణ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.