BREAKING
ఉత్కలాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ నీలమణి దుర్గ ఆలయంలో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో హుండీ ప్రారంభం విపత్తు నిర్వహణలో విద్యార్థుల భాగస్వామ్యం అత్యంత కీలకం పశుగ్రాస సాగుకు దరఖాస్తుల ఆహ్వానం కొత్తమ్మతల్లి సేవలో ఖాకీలు రాష్ట్ర ఫుట్‌బాల్ జట్టుకు ఎంపికైన ఎస్.రాయవరం విద్యార్థినులు! పెనుగొండ వాసవి అమ్మవారి శరన్నవరాత్రులకు ఘన ఏర్పాట్లు ★పది రోజుల పాటు వివిధ అలంకారాల్లో దర్శనం మానసిక ఆరోగ్యంపై అపోహలు వీడాలి! ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ప్రజా సమస్యల వినతులు స్వీకరణ... బీసీలకు ద్రోహం చేసింది వైసీపీనే! చెన్నైలో సీఎం విజయ్‌తో రాహుల్ గాంధీ భేటీ ఢిల్లీలో సీఈసీపై నిరసనల వేళ.. నీలంకరైలోని నివాసంలో గంటపాటు ఏకాంత చర్చలు. జిల్లా జడ్పీ సీఈఓ గా టి.ఎన్.శోభన్ బాబు 25వ రోజుకు చేరిన వి ఆర్ ఏ ల రిలే నిరాహార దీక్ష పాకలపాడు గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం – ప్రజలకు అవగాహన కల్పించిన సీఐ రేవతమ్మ

నిరుపేదల అభ్యున్నతికి ఎమ్మెల్యే 'పల్లా' కృషి.......

Select Suryaa Now
నిరుపేదల అభ్యున్నతికి ఎమ్మెల్యే 'పల్లా' కృషి.......

నిరుపేదల అభ్యున్నతికి ఎమ్మెల్యే 'పల్లా' కృషి.......

మద్దూరు..…నియోజకవర్గంలోని నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా జనగామ శాసన సభ్యుడు డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి కృషి చేస్తున్నట్లు పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఇర్రి రాజిరెడ్డి తెలిపారు. శుక్రవారం మద్దూరు మండలంలోని ధర్మారం గ్రామంలో అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఊట్ల కనకారెడ్డి దవఖాన ఖర్చుల కోసం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సహకారంతో సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ. 2లక్షల ఎల్వోసీ పత్రాన్ని బాధితునికి వైస్ చైర్మన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఎంతోమందికి సీఎంఆర్ఎఫ్ నిధుల మంజూరికి ఎమ్మెల్యే ఎంతగానో కృషి చేసినట్లు తెలిపారు. ఎల్వోసీ మంజూరికి సహకరించిన ఎమ్మెల్యేకు బాధితుని కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ జక్కుల కనకమ్మలింగయ్య, మాజీ సర్పంచ్ ఊట్ల రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు