కాన్షీరాం ఆశయ సాధనకు కృషి చేయాలి
కాన్షీరాం ఆశయ సాధనకు కృషి చేయాలి
-పటాన్‌చెరులో ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయిలో 20వ వర్ధంతి
-అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి ర్యాలీ
-ముదిరాజ్ భవన్‌లో కాన్షీరాంకు ఘన నివాళులు
పటాన్‌చెరు, ; బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాన్షీరాం ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీఎస్పీ నాయకులు పిలుపునిచ్చారు.కాన్షీరాం 20వ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం పటాన్‌చెరులోని ముదిరాజ్ భవన్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ముందుగా పటాన్‌చెరు జాతీయ రహదారిపై ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా ముదిరాజ్ భవన్‌కు చేరుకుని కాన్షీరాం చిత్రపటానికి నివాళులర్పించారు.ఈ కార్యక్రమానికి బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోడపట్ల ఈశ్వర్ ముఖ్య అతిథిగా, లింగంపల్లి యాదగిరి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సతీష్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఉమేష్, మెదక్ పార్లమెంట్ ఇన్‌చార్జి మోహన్, మరో ఇన్‌చార్జి పంగ బాబు పాల్గొన్నారు.పటాన్‌చెరు అసెంబ్లీ ఇన్‌చార్జులు నర్సింగ్ రావు , వినయ్, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, ఉపాధ్యక్షుడు దర్శన్, కార్యదర్శి శ్రీను, కోశాధికారి వేణు, సీనియర్ నాయకులు బీఎస్పీ సంజీవ, జనార్దన్, కృష్ణ, బాలరాజు, అనిత, రేణుక, మంజుల, సుధీర్, శ్రీధర్, అశోక్‌తో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ అసెంబ్లీ కమిటీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.