హిమాయత్ నగర్, మేజర్ న్యూస్ : ఇద్దరు సెల్ఫోన్ దొంగలను నారాయణగూడ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఒప్పో ఎఫ్25 ప్రో ఫోను స్వాధీనం చేసుకున్నారు. నారాయణగూడ ఫ్లైఓవర్ సమీపంలో ఈ ఇద్దరు దుండగులు ఓ వ్యక్తి నుంచి సెల్ ఫోన్ ను దొంగలించారు. బాధితుడు వెంటనే నారాయణగూడ పిఎస్ లో కంప్లైంట్ చేయగా అధికారులు సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఇద్దరు దొంగలు చాదర్ఘాట్ ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా పోలీస్ అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సెల్ ఫోను రికవరీ చేసి బాధితుడికి అందజేశారు.