BREAKING
11వ తేదీన భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తుక్కులూరు పర్యటన రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ కార్యదర్శిగా సయ్యద్ యూనిస్ నియామకం మెగా దసరా మేళ.. పలు ఆఫర్లు విశాఖ ప్రజలు వినియోగించుకోవాలి తల సేమియా బాధితుల చిన్నారుల చికిత్సకు కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి చొరవ కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె --25వరోజు రిలే దీక్షలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ డిండి ప్రాజెక్టుకు ఏదుల నుంచే నీరివ్వాలి...! చిన్న వెంకన్న ఆలయానికి అమావాస్య ఎఫెక్ట్ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం నేడే సీఐ ని సన్మానించిన లయన్స్ క్లబ్. పేదలకు వస్త్ర, అన్నదాన కార్యక్రమం ఎంబీబీఎస్ సీటు సాధించిన రాథోడ్వ విష్ణువర్షను సన్మానించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 108 అంబులెన్స్‌లో సుఖ ప్రసవం.. విద్యార్థినులు సామాజిక సేవలో భాగస్వామ్యులు కావాలి నేటి నుండి శ్రీ దేవీ శరన్నవరాత్రులు

గుంతల రోడ్లతో గోస.. పట్టించుకునే దిక్కేది?

Select Suryaa Now
గుంతల రోడ్లతో గోస.. పట్టించుకునే దిక్కేది?
సూర్య, చింతలమానేపల్లి : మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులు గుంతలమయంగా మారి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రహదారులపై అడుగడుగునా ఏర్పడిన గుంతలు వాహనదారులకు ప్రమాదకరంగా మారగా, నిత్యం రాకపోకలు సాగించే గ్రామీణ ప్రజలు అవస్థలు పడుతున్నారు. రహదారుల దుస్థితి తెలిసినా సంబంధిత అధికారులు మరమ్మతులపై దృష్టి సారించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆడెపల్లి, కొత్తగూడ,  కర్జెల్లి, కేతీని, గూడెం, రాన్వెల్లి, కోయపల్లి తదితర గ్రామాలకు వెళ్లే రహదారుల పరిస్థితి అధ్వానంగా మారడంతో ప్రయాణం ప్రజలకు భారంగా మారింది.
— అడుగుకో గుంత.. ప్రయాణమంతా ప్రమాదమే!
ప్రధాన రహదారులపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతలను తప్పించే క్రమంలో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పే ప్రమాదం ఉంది. రాత్రి వేళల్లో గుంతలు కనిపించకపోవడంతో ప్రమాదాల ముప్పు మరింత పెరుగుతోంది. నిత్యం ఈ మార్గాల్లో ప్రయాణించే వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని గ్రామస్థులు వాపోతున్నారు.
— ఇకనైనా స్పందిస్తారా?
గ్రామీణ ప్రజల రాకపోకలకు కీలకమైన ప్రధాన రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే గుంతలను పూడ్చడంతో పాటు నాణ్యతతో కూడిన శాశ్వత రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ కష్టాలకు పరిష్కారం చూపాలని గ్రామీణ ప్రజలు ఆశిస్తున్నారు.