BREAKING
ఉత్కలాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ నీలమణి దుర్గ ఆలయంలో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో హుండీ ప్రారంభం విపత్తు నిర్వహణలో విద్యార్థుల భాగస్వామ్యం అత్యంత కీలకం పశుగ్రాస సాగుకు దరఖాస్తుల ఆహ్వానం కొత్తమ్మతల్లి సేవలో ఖాకీలు రాష్ట్ర ఫుట్‌బాల్ జట్టుకు ఎంపికైన ఎస్.రాయవరం విద్యార్థినులు! పెనుగొండ వాసవి అమ్మవారి శరన్నవరాత్రులకు ఘన ఏర్పాట్లు ★పది రోజుల పాటు వివిధ అలంకారాల్లో దర్శనం మానసిక ఆరోగ్యంపై అపోహలు వీడాలి! ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ప్రజా సమస్యల వినతులు స్వీకరణ... బీసీలకు ద్రోహం చేసింది వైసీపీనే! చెన్నైలో సీఎం విజయ్‌తో రాహుల్ గాంధీ భేటీ ఢిల్లీలో సీఈసీపై నిరసనల వేళ.. నీలంకరైలోని నివాసంలో గంటపాటు ఏకాంత చర్చలు. జిల్లా జడ్పీ సీఈఓ గా టి.ఎన్.శోభన్ బాబు 25వ రోజుకు చేరిన వి ఆర్ ఏ ల రిలే నిరాహార దీక్ష పాకలపాడు గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం – ప్రజలకు అవగాహన కల్పించిన సీఐ రేవతమ్మ

గ్రావిటీ ప్రీమియర్ స్కూల్‌లో ఘనంగా దసరా–బతుకమ్మ సంబరాలు.

Select Suryaa Now
గ్రావిటీ ప్రీమియర్ స్కూల్‌లో ఘనంగా దసరా–బతుకమ్మ సంబరాలు.

గ్రావిటీ ప్రీమియర్ స్కూల్‌లో ఘనంగా దసరా–బతుకమ్మ సంబరాలు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను, విజయానికి ప్రతీకైన విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రావిటీ ప్రీమియర్ స్కూల్‌లో దసరా–బతుకమ్మ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించినట్లు పాఠశాల కరస్పాండెంట్ బోడ పూనియా నాయక్ శుక్రవారం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలు, విద్యార్థుల కేరింతలు, ఉపాధ్యాయుల ఉత్సాహం, ఆటపాటలు, సాంస్కృతిక నృత్యాలతో పాఠశాల ప్రాంగణం పండుగ శోభను, సంతరించుకుందని పేర్కొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఆనందోత్సాహాలతో ,వేడుకల్లో పాల్గొని పండుగ స్ఫూర్తిని చాటారని తెలిపారు.గ్రావిటీ ప్రీమియర్ స్కూల్ లక్ష్యం కేవలం విద్యాబోధనకే పరిమితం కాకుండా, విద్యార్థులను సంస్కృతి, సంప్రదాయాల పట్ల ,గౌరవం కలిగిన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమేన్నారు.పుస్తక జ్ఞానంతో పాటు, మన సంస్కృతి మూలాలను విద్యార్థులకు పరిచయం చేయడం, ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, ఐకమత్యం, సామాజిక బాధ్యత వంటి విలువలు పెంపొందుతాయని వివరించారు. మన పండుగల విశిష్టతను చిన్నతనం నుంచే తెలుసుకోవడం ,ద్వారా భావితరాలు మన వారసత్వాన్ని గౌరవించి, పరిరక్షిస్తాయన్నారు.
మన సంస్కృతి, అస్తిత్వం, మన సంప్రదాయాలు మన వారసత్వం,వాటిని భావితరాలకు అందించడం మనందరి బాధ్యతఅన్నారు.
ఈ వేడుకలను విజయవంతం చేసిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, పాఠశాల సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రావిటీ ప్రీమియర్ స్కూల్ కుటుంబం తరఫున అందరికీ దసరా, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

సూర్య ప్రతినిధి దశ్రు టేకులపల్లి