గ్రామాభివృద్ధికి సర్పంచ్ లావణ్య ప్రత్యేక కృషి
రూ.5 లక్షలతో వీధి దీపాల ఏర్పాటు
గ్రామాభివృద్ధే లక్ష్యంగా సంకేపల్లిగూడ గ్రామ సర్పంచ్ కుమ్మరి లావణ్య చెన్నయ్య ముందుకు సాగుతున్నారు. గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య సహకారంతో శేరిగూడ, సంకేపల్లిగూడ గ్రామాల్లో రూ.5 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన వీధి దీపాలను శుక్రవారం ప్రారంభించారు.
వీధి దీపాల ఏర్పాటుతో రాత్రివేళల్లో గ్రామస్తులకు ఇబ్బందులు తగ్గడంతో పాటు, వీధుల్లో వెలుగులు నిండనున్నాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతూ, గ్రామంలో మిగిలి ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని సర్పంచ్ కుమ్మరి లావణ్య చెన్నయ్య తెలిపారు. గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు కుమ్మరి చెన్నయ్య, ఉపసర్పంచ్ ప్రభాకర్, వార్డు సభ్యుడు సత్తయ్య, మాజీ సర్పంచ్ దర్శన్, శివరాములు, నర్సింహారెడ్డి, వాజిద్ తదితరులు పాల్గొన్నారు.
షాబాద్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 09)