ఎస్సీ భూముల జోలికొస్తే చర్యలు తప్పవు
- భూముల ఆక్రమణపై మల్లయ్య భట్టు సీరియస్
-ఖాజాగూడ నుంచి నెక్నాంపూర్ వరకు ఎస్సీ భూములపై నిఘా
-ఎస్సీ భూముల పరిరక్షణే లక్ష్యం -అక్రమాలకు నో ఛాన్స్
-ఎస్సీ కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీ మల్లయ్య భట్టు
రంగారెడ్డి జిల్లాలోని ఖాజాగూడ, నార్సింగి, నెక్నాంపూర్ ప్రాంతాల్లో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ పౌల్ట్రీ కాంప్లెక్స్లను ఎస్సీ కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీ మల్లయ్య భట్టు మంగళవారం సందర్శించారు. కాంప్లెక్స్లను పరిశీలించిన ఆయన, ఎస్సీ కార్పొరేషన్కు చెందిన భూములను పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భూముల చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జొన్నల పద్మావతిని ఆదేశించారు. ఈ సందర్భంగా అక్కడి లబ్దిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎస్సీ లబ్ధిదారులు కాకుండా ఇతరులు ఎవరైనా అక్కడ ఇళ్లు నిర్మించుకున్నట్లయితే, వారికి వెంటనే నోటీసులు జారీ చేసి, అక్రమ నిర్మాణాలను తొలగించి వారిని అక్కడి నుంచి పంపించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్లు శివ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వడ్ల శ్రీనివాస చారి: రంగారెడ్డి - మేజర్ న్యూస్.