ఎల్ నివొ ప్రభావం అన్ని రంగాల పై ఉంటుంది...
#. ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. నల్గొండ జిల్లా బ్యూరో, మేజర్ న్యూస్...
రాబోయే రోజుల్లో ఎల్ నినో ప్రభావం అన్ని రంగాలపై ఉంటుందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని వచ్చే జూలై వరకు ప్రధాన శాఖలు ప్రత్యామ్నాయ కార్యచరణ ప్రణాళికలు రూపొందించి వెంటనే సమర్పించాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు.సీజనల్ కండిషన్స్ పై శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం, అలాగే సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదే అంశంపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్న దృష్ట్యా శనివారం జిల్లా కలెక్టర్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో
జిల్లా అధికారులతో సమావేశమయ్యారు.
ఎల్ నినో దృష్ట్యా రానున్న 270 రోజులు అధికారులందరూ పూర్తి అప్రమత్తంగా, చురుకుగా ఉండాలని, రైతులు ,ప్రజలు ప్రజాప్రతినిధుల సమన్వయం తో ఎల్ నినో పరిస్థితులు అధిగమించేలా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందులో భాగంగా వివిధ రంగాలలో ప్రజలు, రైతులు, తదితరులు ఇబ్బందులు పడకుండా ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు.రామన్న కాలంలో తాగునీటికీ ఎక్కువ ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నందున అందుబాటులో ఉన్న తాగునీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని, బోర్ల రీఛార్జి ,పైప్లైన్ మరమ్మతు, తదితరవాటికి అంచనాలు రూపొందించాలని,మున్సిపాలిటీలలో సైతం తాగునీటికి ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంతాలు, మున్సిపల్ వారిగా రానున్న 3 నెలలకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. మున్సిపాలిటీలలో అమృథ్ పనులను పూర్తిచేయాలని ,అలాగే స్థానిక నీటి వనరుల పనులఎల్ నినో వల్ల వర్షాలు లేనందున పంటలు పండే అవకాశం లేదని , రైతులు ,రైతు కూలీలకు ఇబ్బంది కలగకుండా విబిజిరామ్ జి కింద పెద్ద ఎత్తున పనులను గుర్తించి చేపట్టాలని,
కూలీలకు పని కల్పించే పనులను చేపట్టాలని, ఇందుకు ఎలాంటి పరిమితి లేదని, జిల్లాలో పెద్ద ఎత్తున పనులు చేపట్టేందుకు అవకాశం ఉందని, ప్రతి గ్రామంలో పనులు గుర్తించి వెంటనే పనులు చేపట్టాలని, దీని ద్వారా ఆస్తుల సృష్టికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎండిపోయిన బావులు, బోర్ల వద్ద రీఛార్జ్ నిర్మాణాలు చేపట్టాలన్నారు. మ్యాజిక్ షోక్ పిట్లు, ఫామ్ పౌండ్లు, పర్కులేషన్ ట్యాంకులు చేపట్టాలని సూచించారు. వేసిన పంటలు, ఎండిపోయిన పంటలు, ఇతర వివరాల పై నివేదిక తయారు చేయాలని, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు .భూగర్భ జలవనరుల శాఖ ద్వారా వర్షపాతం భూగర్భ జలాల అందుబాటు, తదితర వివరాలను దృష్టిలో ఉంచుకొని నివేదిక కాగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం జిల్లాలో భూగర్భ జలాల మట్టం 2 మీటర్లు తగ్గినట్లు తెలిపారు. ఉన్న భూగర్భ జలాలు తగ్గిపోవడానికి గల కారణాలను కూడా విశ్లేషించాలని కలెక్టర్ ఆదేశించారు.రిజర్వాయర్లు,చెరువులలో ఉన్న నీరు, భవిష్యత్తులో వినియోగించే నీరు తదితర వివరాలపై కూడా నివేదిక సమర్పించాలని, ప్రతి రిజర్వాయర్ , చెరువు వారిగా విశ్లేషించి నివేదిక ఇవ్వాలన్నారు.
రానున్న రోజుల్లో పశువులు తాగు నీటికి, పశుగ్రాసానికి ఇబ్బందులు పడకుండా పశుసంవర్ధక శాఖ ద్వారా పశుగ్రాసం పై అదే విధంగా పశువుల తాగునీటిపై నివేదికతో పాటు, అంచనాలను సమర్పించాలని .స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి డి ఆర్ ఓ దశరథ, జిల్లా అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.