సూర్య జైనూర్: ఈ నెల 13 నుంచి 21వ తేదీ వరకు నాగ్పూర్లో నిర్వహించనున్న ధమ్మ క్రాంతి ర్యాలీలో జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాలకు చెందిన సమతా సైనిక్ దళ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదిలాబాద్ జిల్లా సమతా సైనిక్ దళ్ నాయకులు మార్షల్ రమాకాంత్ కాంబ్లే కోరారు.జైనూర్ మండల కేంద్రంలో ధమ్మ క్రాంతి ర్యాలీకి సంబంధించిన పోస్టర్లను ఆయన విడుదల చేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్థాపించిన సమతా సైనిక్ దళ్ శతాబ్ది వారోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నాగ్పూర్లో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాలకు చెందిన సమతా సైనిక్ దళ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంబ్లే ఆనంద్, కాంబ్లే అశోక్, వాగ్మారే తదితరులు పాల్గొన్నారు.