భక్తిశ్రద్ధలతో శ్రీ సుదర్శన హవనం
ఘట్‌కేసర్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 4): ఎదులాబాద్ గ్రామంలోని శ్రీ గరుడ గోదా సమేత మన్నార్ రంగనాయక స్వామి ఆలయంలో వార్షిక శ్రీ సుదర్శన హవనం ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఉదయం గోత్రనామాల పారాయణంతో కార్యక్రమాన్ని ప్రారంభించి, అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, సుదర్శన హవనం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య హోమ కార్యక్రమాలు కొనసాగాయి. మధ్యాహ్నం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. సుదర్శన హవనంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కార్యక్రమంలో ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
రిపోర్టర్ గుర్రం రమేష్.