వృషభ రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026 | Taurus Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani
వృషభ రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026 | Taurus Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani
♉వృషభరాశి… ప్రారంభంలో తోబుట్టువులు, మిత్రుల నెట్వర్క్ అనుకూలిస్తుంది. తండ్రి పెద్దల తోడ్పాటు. నూతన అవకాశాలు. మానసిక ప్రశాంతత ముఖ్యం. సజ్జన సహకారంలో అసంతృప్తి. ఆకస్మిక లాభాలకు కొంతవరకు అవకాశం. ప్రయాణాలు లాభిస్తాయి. అయినప్పటికీ తగు జాగ్రత్తలు ముఖ్యం. మధ్యలో ఆత్మీయుల కొరకు, ఆరోగ్యం, పెట్టుబడుల కొరకు ఖర్చులు అధికం. ముఖ్యులతో ఘర్షణలకు తావివ్వరాదు. నూతన ఉత్సాహం, కొత్త ఆలోచనలు, పనులు కొంత వరకు ముందుకు వెళతాయి. పూర్వపు రుణములు తీరుస్తారు. ఆరోగ్యం అనుకూలం. శ్రమతో పనులు సాధిస్తారు. వారాంతం ఆర్థిక విషయ, వాగ్దానాలలో, కుటుంబ, బంధు మిత్రులతో చర్చలు. సమయస్ఫూర్తిగా నిర్ణయాలు, రుణ విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. దత్త ఆరాధన మేలు