ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ పాఠశాల శంకుస్థాపనకు హాజరుకానున్న వేం -పాఠశాల పరిసరాలను అధికారులతో కలిసి పరిశీలించిన మండల అధ్యక్షులు యాదవ రెడ్డి
నెల్లికుదురు , మేజర్ న్యూస్ ,రాజ్యసభ సభ్యులువేం నరేందర్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నఇంటిగ్రేటెడ్ పబ్లిక్ పాఠశాల పనులుఅక్టోబర్ 27న శంకుస్థాపన చేయడానికి విచ్చేస్తున్న నేపథ్యంలోకాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎదల్లయాదవ రెడ్డి అధికారుల తో కలిసిసోమవారం పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. యాదవరెడ్డి మాట్లాడుతూ వేం నరేందర్ రెడ్డి తో పాటుగాఎమ్మెల్యే మురళి నాయక్,ఎంపీ బలరాం నాయక్,డిసిసిఅధ్యక్షురాలు ఉమా మురళి నాయక్ హజరుకానున్నారని,అధిక సంఖ్యలో ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలుప్రజలు హాజరుకావాలని కోరారు.ఈ కార్యక్రమంలోతహసిల్దార్ చందా నరేష్,ఎస్సై గంగారపు కరుణాకర్,మండల విద్యాధికారి రాందాస్ అధికారులునాయకులు ఆకుతోట సతీష్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్; ప్రసాద్, నెల్లికుదురు, మహబూబాబాద్ జిల్లా