మహర్షి వాల్మీకి జీవితం, ఆదర్శాలు సమాజానికి స్ఫూర్తిదాయకం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
సంగారెడ్డి, :- మహర్షి వాల్మీకి జీవితం, ఆదర్శాలు, ఆయన రచించిన రామాయణం సమాజానికి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి, మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహర్షి వాల్మీకి రచించిన రామాయణం మానవాళికి ధర్మం, సత్యం, న్యాయం, కర్తవ్యనిష్ఠ వంటి విలువలను బోధిస్తుందని పేర్కొన్నారు. ఆయన జీవితం మనిషిలో మార్పు సాధ్యమేనని, పట్టుదల, జ్ఞానం, నిరంతర కృషితో ఉన్నతమైన లక్ష్యాలను సాధించవచ్చని చాటిచెబుతుందన్నారు. మహర్షి వాల్మీకి బోధనలను ఆచరిస్తూ సమాజంలో సద్భావన, సమానత్వం, నైతిక విలువలను పెంపొందించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జగదీశ్, వివిధ శాఖల అధికారులు, వాల్మీకి జయంతి ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ బోయ వెంకటేశం, వాల్మీకి బోయ సంఘం ప్రతినిధులు వెంకట రామయ్య, బుచ్చయ్య, సంఘమేష్, ప్రభు, బక్కప్ప, శివరాజ్, శ్రీనివాస్, అనిల్, రాములు, ఆగమయ్య, రాజు, పండరి, జ్ఞానేశ్వర్, దినేష్, టీఎన్జీవో ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.