న్యూఢిల్లీలో 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్, 10 భాగస్వామ్య దేశాలు.. ఉమ్మడి దృక్పథం.. ప్రపంచ సహకారమే లక్ష్యం!
ఒంగోలు, మేజర్‌న్యూస్ :న్యూఢిల్లీలో అక్టోబర్ 26, 27 తేదీల్లో నిర్వహిస్తున్న 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. ఈ ఫోరమ్‌లో బ్రిక్స్ సభ్య, భాగస్వామ్య దేశాల పార్లమెంటరీ ప్రతినిధులు పాల్గొని ప్రజాస్వామ్య పాలన, పార్లమెంటరీ సహకారం, ప్రజా కేంద్రీకృత అభివృద్ధి, అంతర్జాతీయ భాగస్వామ్యంపై చర్చిస్తున్నారు. ప్రపంచ దేశాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడమే ఈ ఫోరమ్ ప్రధాన లక్ష్యం. ఒకే వేదిక.. ఉమ్మడి దృక్పథం.. మెరుగైన ప్రపంచ భవిష్యత్తు!