BREAKING
చెన్నైలో అదరగొడుతున్న పద్మశ్రీ తోట తరణి కళా ప్రదర్శన.. ఐదు దశాబ్దాల అద్భుత సృష్టి! రమేష్ గౌడ్‌ను అఖండ మెజార్టీతో గెలిపించండి గిరిజనుల సంపూర్ణ మద్దతు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే శివకుమార్ నాయక్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముందస్తు అరెస్టులు కాదు.. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి రజనీకాంత్ 'ధర్మన్'లో లేడీ సూపర్‌స్టార్ ఎంట్రీ.. ఐదేళ్ల తర్వాత క్రేజీ కాంబినేషన్ రిపీట్! 3, 4వ వార్డుల్లో వైఎస్సార్‌సీపీ ప్రచార సందడి పెళ్లిపై నటి రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. దర్శకుడు కృష్ణవంశీతో బంధంపై ఆసక్తికర నిజాలు! ఎంపీటీసీ అభ్యర్థులు రేపటిలోగా బీఫార్మ్స్ సమర్పించాలి. అలాగే రేపే ఉపసంహరణకు చివరి గడువు. భూ సర్వేకు రైతులు సహకరించాలి:డిప్యూటీ తహసీల్దార్ సురేష్ అలరించడానికి సిద్ధమైన'రణబాలి'చిత్రంలోని ఏందయ్యా సామీ పూర్తి వీడియో సాంగ్! ఏటీఎం చోరీ... ముఠా గుట్టురట్టు.. రాజస్థాన్‌లో ప్రధాన నిందితుడి అరెస్ట్ బెంగళూరులో ఉద్రిక్తత: సిద్ధరామయ్య నివాసం వైపు బీజేపీ ర్యాలీ భగ్నం వాల్మీకి మహర్షిని ఆదర్శంగా తీసుకోవాలి..ఏవో కృష్ణయ్య ఏఐ బూమ్ నిజమేనా? సిలికాన్ వ్యాలీని ప్రశ్నించిన నిఖిల్ కామత్! రాజకీయాల్లోకి త్రిష ఎంట్రీ?.. కోయంబత్తూరు ఈవెంట్‌లో నటి రియాక్షన్ మరియు వైరల్ స్మైల్‌పై చర్చ! రాజకీయ ఎంట్రీపై జోరుగా ప్రచారం.. వేలాది మంది మహిళా అభిమానులతో ధనుష్ సంచలన సమావేశం!

పెడనలో కూటమి అభ్యర్థుల విజయానికి బుద్ధప్రసాద్ ప్రచారం

Select Suryaa Now
పెడనలో కూటమి అభ్యర్థుల విజయానికి బుద్ధప్రసాద్ ప్రచారం

పెడన, మేజర్ న్యూస్: జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌తో కలిసి 17వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ, బీజేపీ బలపరిచిన జనసేన మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి బళ్ళ జ్ఞానలింగ జ్యోత్స్న రాణి, వార్డు అభ్యర్థి సయ్యద్ ఫర్హాలను గెలిపించాలని కోరుతూ ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యమయ్యాయని, అసెంబ్లీలో అనుచిత భాషతో రాజకీయ విలువలను దిగజార్చారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను గమనించి ఓటర్లు కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, తద్వారా మరిన్ని అభివృద్ధి పనులకు ప్రోత్సాహం అందించాలని పిలుపునిచ్చారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెడన నియోజకవర్గం, కృష్ణాజిల్లా.