BREAKING
పెళ్లిపై నటి రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. దర్శకుడు కృష్ణవంశీతో బంధంపై ఆసక్తికర నిజాలు! ఎంపీటీసీ అభ్యర్థులు రేపటిలోగా బీఫార్మ్స్ సమర్పించాలి. అలాగే రేపే ఉపసంహరణకు చివరి గడువు. భూ సర్వేకు రైతులు సహకరించాలి:డిప్యూటీ తహసీల్దార్ సురేష్ అలరించడానికి సిద్ధమైన'రణబాలి'చిత్రంలోని ఏందయ్యా సామీ పూర్తి వీడియో సాంగ్! ఏటీఎం చోరీ... ముఠా గుట్టురట్టు.. రాజస్థాన్‌లో ప్రధాన నిందితుడి అరెస్ట్ బెంగళూరులో ఉద్రిక్తత: సిద్ధరామయ్య నివాసం వైపు బీజేపీ ర్యాలీ భగ్నం వాల్మీకి మహర్షిని ఆదర్శంగా తీసుకోవాలి..ఏవో కృష్ణయ్య ఏఐ బూమ్ నిజమేనా? సిలికాన్ వ్యాలీని ప్రశ్నించిన నిఖిల్ కామత్! రాజకీయాల్లోకి త్రిష ఎంట్రీ?.. కోయంబత్తూరు ఈవెంట్‌లో నటి రియాక్షన్ మరియు వైరల్ స్మైల్‌పై చర్చ! రాజకీయ ఎంట్రీపై జోరుగా ప్రచారం.. వేలాది మంది మహిళా అభిమానులతో ధనుష్ సంచలన సమావేశం! ప్రభుదేవా, సిమ్రాన్ క్రేజీ కాంబినేషన్.. కొత్త చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్ ఖరారు! అసోం కూల్చివేతలపై బంగ్లాదేశ్ విపక్ష నేత ఆరోపణలు తిప్పికొట్టిన మంత్రి! కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు.. చిత్ర పరిశ్రమలో అభద్రతాభావంతో ఉండే హీరోలపై నటి షాకింగ్ కామెంట్స్! వివాదంలో 'ఫౌజీ' సినిమా.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడి తీవ్ర అభ్యంతరం, బహిరంగ క్షమాపణలకు డిమాండ్! వాసవి అమ్మవారికి సారె సమర్పించిన శిద్ధా లక్ష్మీ పద్మావతి.

ఉయ్యూరులో అభివృద్ధి పనులే కీలకం

Select Suryaa Now
ఉయ్యూరులో అభివృద్ధి పనులే కీలకం

ఉయ్యూరు, మేజర్ న్యూస్: ఉయ్యూరు మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా 7వ వార్డులో కూటమి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి చెదుర్తిపాటి ప్రవీణ్ కుమార్, కౌన్సిలర్ అభ్యర్థి మెరుగు చిన్న కోటయ్య విజయాన్ని కాంక్షిస్తూ కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. రహదారులు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. గత పాలనలో పరిష్కారం కాని సమస్యలపై ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉందని, ప్రజాప్రతినిధులు తమ పనితీరుకు సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చే హామీల కంటే క్షేత్రస్థాయిలో కనిపించే అభివృద్ధి పనులకే ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతూ జవాబుదారీతనంతో కూడిన పాలన అందించడమే కూటమి లక్ష్యమని తెలిపారు. ఉయ్యూరు అభివృద్ధికి కట్టుబడి ఉన్న కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.