BREAKING
ఎంపీటీసీ అభ్యర్థులు రేపటిలోగా బీఫార్మ్స్ సమర్పించాలి. అలాగే రేపే ఉపసంహరణకు చివరి గడువు. భూ సర్వేకు రైతులు సహకరించాలి:డిప్యూటీ తహసీల్దార్ సురేష్ అలరించడానికి సిద్ధమైన'రణబాలి'చిత్రంలోని ఏందయ్యా సామీ పూర్తి వీడియో సాంగ్! ఏటీఎం చోరీ... ముఠా గుట్టురట్టు.. రాజస్థాన్‌లో ప్రధాన నిందితుడి అరెస్ట్ బెంగళూరులో ఉద్రిక్తత: సిద్ధరామయ్య నివాసం వైపు బీజేపీ ర్యాలీ భగ్నం వాల్మీకి మహర్షిని ఆదర్శంగా తీసుకోవాలి..ఏవో కృష్ణయ్య ఏఐ బూమ్ నిజమేనా? సిలికాన్ వ్యాలీని ప్రశ్నించిన నిఖిల్ కామత్! రాజకీయాల్లోకి త్రిష ఎంట్రీ?.. కోయంబత్తూరు ఈవెంట్‌లో నటి రియాక్షన్ మరియు వైరల్ స్మైల్‌పై చర్చ! రాజకీయ ఎంట్రీపై జోరుగా ప్రచారం.. వేలాది మంది మహిళా అభిమానులతో ధనుష్ సంచలన సమావేశం! ప్రభుదేవా, సిమ్రాన్ క్రేజీ కాంబినేషన్.. కొత్త చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్ ఖరారు! అసోం కూల్చివేతలపై బంగ్లాదేశ్ విపక్ష నేత ఆరోపణలు తిప్పికొట్టిన మంత్రి! కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు.. చిత్ర పరిశ్రమలో అభద్రతాభావంతో ఉండే హీరోలపై నటి షాకింగ్ కామెంట్స్! వివాదంలో 'ఫౌజీ' సినిమా.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడి తీవ్ర అభ్యంతరం, బహిరంగ క్షమాపణలకు డిమాండ్! వాసవి అమ్మవారికి సారె సమర్పించిన శిద్ధా లక్ష్మీ పద్మావతి. 2026లో భారత మార్కెట్ల నుంచి రూ.3.08 లక్షల కోట్ల ఎఫ్‌పీఐ నిధులు ఔట్..మార్కెట్‌ను ఆదుకుంటున్న డిఐఐల కొనుగోళ్లు!

వారం రోజుల్లో డిప్యూటీ తహసీల్దార్ నియామకం - ప్రజావాణిలో అదనపు కలెక్టర్ హామీ

Select Suryaa Now
వారం రోజుల్లో డిప్యూటీ తహసీల్దార్ నియామకం - ప్రజావాణిలో అదనపు కలెక్టర్ హామీ

సూర్య వీణవంక వీణవంక మండల తహసీల్దార్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న డిప్యూటీ తహసీల్దార్, సర్వేయర్ పోస్టులను భర్తీ చేసి, ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సామాజిక కార్యకర్త, తెలంగాణ ఉద్యమకారుడు పత్తి వేణుగోపాల్ రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఐఏఎస్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. వీణవంక మండల తహసీల్దార్ కార్యాలయంలో కీలకమైన పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రజలు రెవెన్యూ సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా భూ సమస్యలు, భూముల సర్వే, ఇతర రెవెన్యూ సంబంధిత పనులు సకాలంలో పూర్తికాక ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వివరించారు.
కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ వైద్య సెలవులో ఉండటంతో పనుల నిర్వహణపై మరింత ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన రెవెన్యూ సేవలు సజావుగా అందాలంటే ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయడంతో పాటు, ప్రత్యామ్నాయ సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వినతిపత్రంలో కోరారు.
వారం రోజుల్లో డిప్యూటీ తహసీల్దార్‌ను నియమిస్తాం: అదనపు కలెక్టర్
వినతిపత్రంపై స్పందించిన అదనపు కలెక్టర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే.. వారం రోజుల్లో వీణవంక మండలానికి డిప్యూటీ తహసీల్దార్‌ను నియమిస్తామని హామీ ఇచ్చినట్లు పత్తి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. అలాగే సర్వేయర్ పోస్టును కూడా భర్తీ చేసి, పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ కార్యాలయంలో అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచి, భూ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.