భూ సమస్య పరిష్కరించాలని వినతి
ఆత్మకూరు /మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో సోమవారం మండల పరిషత్ కార్యాలయం నందు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పింఛన్ల గ్రామానికి చెందిన గ్రామస్తులు గ్రామ శివారులోని సర్వే నెంబర్ 128 లోని ఐదు ఎకరాల భూమిని 1996లో గ్రామ మాజీ సర్పంచ్ రామస్వామి గౌడ్ మాజీ ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, భూమిని విక్రయించినారు .సాదా బైనమా ద్వారా భూమిని రామస్వామి గౌడ్ పేరు మీద సాదా బైనమా చేసి భూమిని బదలాయింపు చేయాలని కోరుకుంటూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది .ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రాబర్ట్, మచ్చేందర్ గౌడ్, ఖాజన్న, మాసన్న ,సుధాకర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. సమస్య పరిష్కరించాలని వినతి ఇచ్చినట్లు తెలిపారు.
_రాజారత్నం, ఆత్మకూరు వనపర్తి జిల్లా.