నవంబర్ 27 వరకు సాగునీరు విడుదల చేయాలి
ఆత్మకూరు/మేజర్ న్యూస్: రైతులకు సాగునీరు నవంబర్ 27 వరకు నీటి విడుదల చేయాలని ఆత్మకూరు మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవికుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఆత్మకూరులో విలేకరులతో మాట్లాడుతూ.. నీటిపారుదల శాఖ అధికారులు ప్రకటన విడుదల చేశారని ఇదే చివరి నీటి విడుదలని తెలియజేశారు. అది మంచి పద్ధతి కాదని, రైతులు పంట చివరిదశలో ఉన్నందున నవంబర్ 27 వరకు నీటి విడుదల చేయాలని ,లేదంటే టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఇదివరకు మంత్రులు రైతులకు హామీ ఇచ్చారని హామీ ప్రకారం నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.