మోర్రపూర్ గ్రామంలో ఫారం ఫండ్ పనులను ప్రారంభించిన సర్పంచ్
సూర్య, ముస్తాబాద్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, వ్యవసాయానికి తోడ్పాటునందించే లక్ష్యంతో VB-GRAMG పథకంలో భాగంగా మోర్రపూర్ గ్రామంలో ఫారం ఫండ్ పనులను సోమవారం ప్రారంభించారు.గ్రామ సర్పంచ్ భూక్య రాజు నాయక్,ఉపసర్పంచ్ బాధవత్ రవికుమార్ కార్యక్రమంలో పాల్గొని పనుల ప్రారంభానికి సహకరించారు.గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు ఉపాధి హామీ కూలీలకు పని కల్పించేందుకు ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా చర్యలు చేపడుతోంది.ఇందులో భాగంగా మోర్రపూర్ గ్రామంలో ఫారం ఫండ్ పనులు ప్రారంభించడం ద్వారా గ్రామీణ అభివృద్ధికి మరింత ప్రాధాన్యం కల్పించనున్నారు.సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనులను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ రమేష్, గ్రామ కార్యదర్శి, మేట్లు రమేష్, నర్సింహా, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.