BREAKING
ఎంపీటీసీ అభ్యర్థులు రేపటిలోగా బీఫార్మ్స్ సమర్పించాలి. అలాగే రేపే ఉపసంహరణకు చివరి గడువు. భూ సర్వేకు రైతులు సహకరించాలి:డిప్యూటీ తహసీల్దార్ సురేష్ అలరించడానికి సిద్ధమైన'రణబాలి'చిత్రంలోని ఏందయ్యా సామీ పూర్తి వీడియో సాంగ్! ఏటీఎం చోరీ... ముఠా గుట్టురట్టు.. రాజస్థాన్‌లో ప్రధాన నిందితుడి అరెస్ట్ బెంగళూరులో ఉద్రిక్తత: సిద్ధరామయ్య నివాసం వైపు బీజేపీ ర్యాలీ భగ్నం వాల్మీకి మహర్షిని ఆదర్శంగా తీసుకోవాలి..ఏవో కృష్ణయ్య ఏఐ బూమ్ నిజమేనా? సిలికాన్ వ్యాలీని ప్రశ్నించిన నిఖిల్ కామత్! రాజకీయాల్లోకి త్రిష ఎంట్రీ?.. కోయంబత్తూరు ఈవెంట్‌లో నటి రియాక్షన్ మరియు వైరల్ స్మైల్‌పై చర్చ! రాజకీయ ఎంట్రీపై జోరుగా ప్రచారం.. వేలాది మంది మహిళా అభిమానులతో ధనుష్ సంచలన సమావేశం! ప్రభుదేవా, సిమ్రాన్ క్రేజీ కాంబినేషన్.. కొత్త చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్ ఖరారు! అసోం కూల్చివేతలపై బంగ్లాదేశ్ విపక్ష నేత ఆరోపణలు తిప్పికొట్టిన మంత్రి! కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు.. చిత్ర పరిశ్రమలో అభద్రతాభావంతో ఉండే హీరోలపై నటి షాకింగ్ కామెంట్స్! వివాదంలో 'ఫౌజీ' సినిమా.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడి తీవ్ర అభ్యంతరం, బహిరంగ క్షమాపణలకు డిమాండ్! వాసవి అమ్మవారికి సారె సమర్పించిన శిద్ధా లక్ష్మీ పద్మావతి. 2026లో భారత మార్కెట్ల నుంచి రూ.3.08 లక్షల కోట్ల ఎఫ్‌పీఐ నిధులు ఔట్..మార్కెట్‌ను ఆదుకుంటున్న డిఐఐల కొనుగోళ్లు!

విద్యార్థుల భవిష్యత్తుకు సైకిళ్ల బహుమతి! సొంత నిధులతో 30 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ

Select Suryaa Now
విద్యార్థుల భవిష్యత్తుకు సైకిళ్ల బహుమతి!  సొంత నిధులతో 30 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ

కొండాపూర్ ; చెర్ల గోపులారం గ్రామం నుంచి మల్లేపల్లి, తేర్పోల్ ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల కష్టాలను గుర్తించిన గుంతపల్లి సర్పంచ్,  పడమటి అనంత్ రెడ్డి సొంత నిధులతో సోమవారం 30 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. కాలినడకన పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమంపై విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు సమయానికి పాఠశాలలకు చేరుకుని, బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలనే లక్ష్యంతో సైకిళ్లు అందించినట్లు అనంత్  రెడ్డి తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి గ్రామానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

గతంలోనూ విద్యార్థులకు అండగా..

గతంలో మల్లేపల్లి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసారు , గోపులారం గ్రామంలో పలుమార్లు సేవా కార్యక్రమాలు చేపట్టారని గ్రామస్తులు గుర్తుచేశారు. పేదలకు ఆర్థిక సాయం అందించడంతోపాటు, అనారోగ్యంతో ఆసుపత్రుల్లో ఉన్నవారిని పరామర్శించి ఆదుకోవడం, కరోనా సమయంలో సహాయ సహకారాలు అందించడం, శుభకార్యాలకు ఆర్థికంగా తోడ్పడటం వంటి సేవలు చేశారని కొనియాడారు.విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందించడం తమ పిల్లల చదువుకు ఎంతో ఉపయోగపడుతుందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. అనంత్ రెడ్డి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకు మరింత సేవ చేయాలని గ్రామస్తులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహేశ్వరి సతీష్, ఉపసర్పంచ్ పుణ్యమ్మ రాములు, వార్డు సభ్యులు పట్నం సురేష్, నవీన్, రవి, సుజాత మాజీ సర్పంచ్ రత్నయ్య, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.