ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం
అనంతపురం మేజర్ న్యూస్ ప్రతినిధి:- ఆశ్వయుజ మాసం శుద్ధ పౌర్ణమి సందర్భంగా అనంతపురం నగరంలోని 3వ రోడ్డులో ఉన్న శ్రీ షిరిడి సాయి మందిరంలో ఈరోజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులు వ్రతంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని కుటుంబసభ్యులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులు ఉత్సాహంగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్