మేష రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026 | Aries Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani
మేష రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026 | Aries Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani
♈మేషరాశి… ప్రారంభంలో వృత్తిపరమైన శ్రమ ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ప్రయాణాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, ఉన్నత విద్య విషయ ప్రణాళికలు, మార్పులు. మాతృ, గృహ, విద్య అంశాలలో ఆలోచనలలో, మాటలలో ప్రశాంతత కొరకు, పెద్దల సహకారాన్ని,ఆశీస్సులను సద్వినియోగ పరుచుకుంటూ ఘర్షణలను అధిగమించాలి. మధ్యలో వృత్తి, వ్యక్తిగత విషయాలలో ఆకస్మిక ఆలోచనలలో ఆత్మస్థైర్యం ముఖ్యం. నిర్ణయాలలో ఉద్వేగాలకు తావివ్వరాదు. కుటుంబ విష యాలలో, వ్యాపార వ్యవహారాలలో, జీవిత భాగస్వామితో కమ్యూనికేషన్ జాగ్రత్తలు అవసరం. వాగ్దానాలు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. వారాంతం మిత్రులతో చర్చలు, ప్రయాణాలు. ఆత్మీయులతో, ప్రియమైన వ్యక్తులతో ఒప్పందాలలో జాగ్రత్త అవసరం. విష్ణుమూర్తి ఆరాధన మేలు.