కింగ్ సినిమా నుంచి డాడీ కూల్ సాంగ్ రిలీజ్.. షారుఖ్ ఖాన్, కరీనా కపూర్ జోడీ మళ్లీ సందడి
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ మరోసారి కలిసి డ్యాన్స్ ఫ్లోర్‌ను షేక్ చేశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందిన కింగ్ చిత్రంలోని డాడీ కూల్ అనే ఉత్సాహభరితమైన పాటను చిత్రబృందం విడుదల చేసింది.
రెట్రో డిస్కో బీట్స్, క్యాబరే శైలి గ్లామర్ కలయికతో వచ్చిన ఈ పాటలో షారుఖ్, కరీనా కెమిస్ట్రీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గతంలో రా.వన్ చిత్రంలో చమ్మక్ ఛలో పాటతో అలరించిన షారుఖ్ ఖాన్, కరీనా కపూర్ ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు డాడీ కూల్ సాంగ్‌తో తెరపై సందడి చేశారు. ఈ పాటను సచిన్ జిగర్ స్వరపరచగా, కుమార్ సాహిత్యం అందించారు. అరిజిత్ సింగ్, శిల్పా రావు ఆలపించిన ఈ పాటకు వైభవీ మర్చంట్ నృత్యరీతులు సమకూర్చారు.
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కింగ్ నుంచి వచ్చిన ఈ రెండో పాట సినిమాపై అంచనాలను మరింత పెంచింది. షారుఖ్ ఖాన్, కరీనా కపూర్‌లతో పాటు దీపికా పదుకొణె, సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్, రాణీ ముఖర్జీ, అనిల్ కపూర్ తదితర ప్రముఖ తారాగణం ఈ చిత్రంలో నటిస్తున్నారు.విభిన్నమైన స్టైల్, వేగవంతమైన బీట్స్‌తో సాగే డాడీ కూల్ పాట సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న కింగ్ చిత్రానికి ఈ పాట ప్రచారంలో కీలక బలంగా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.