BREAKING
రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు మహిళలకు ఉచిత మగ్గం వర్క్ శిక్షణ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం మసీదులో నమాజ్‌కు రాజకీయాలతో సంబంధం లేదు.. అన్నారంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ద్వారకామాయి కాలనీ అభివృద్ధికి రూ.23 లక్షలతో సీసీ రోడ్డు మంజూరు చొల్లవీడు పంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థి బత్తిని చిన్న రంగమ్మ ఏకగ్రీవ ఎన్నిక గంగవరంలో ఎల్లంపల్లి మురళి ఘన విజయం 1,080 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు.. ఉపసర్పంచ్‌గా శ్రావణి ఎన్నిక బిర్యానీ తినాలంటూ పరిచయం.. నిర్మానుష్య ప్రాంతంలో బెదిరించి దోపిడీ ఎమ్మెల్యే అమర్నాథరెడ్డిని సన్మానించిన కూర్మాయి సర్పంచ్ విజయ మిట్స్ వర్సిటీ నూతన వీసీగా ప్రొఫెసర్ సరాజు పి.మొహంతి నియామకం : నాణ్యమైన విద్య,ఉపాధి అవకాశాల కల్పనే ప్రధాన లక్ష్యమని వెల్లడి : శుభాకాంక్షలు తెలిపిన ఛాన్సల్లర్ ఎన్.విజయ్ భాస్కర్ చౌదరి సోమీదేవిపల్లి పంచాయతీలో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవ ఎన్నిక ఖమ్మం నగరంలో పలు వివాహ శుభకార్యాలకు హాజరైన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ..* 2025–26లో 378.5 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి రాజ్యాంగంతోనే సమాన అవకాశాలు

టాలీవుడ్‌లో కొత్త సంచలనం: దర్శకుడిగా మారుతున్న 'ఆర్ ఎక్స్ 100' హీరో కార్తికేయ!

Select Suryaa Now
టాలీవుడ్‌లో కొత్త సంచలనం: దర్శకుడిగా మారుతున్న 'ఆర్ ఎక్స్ 100' హీరో కార్తికేయ!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: 'ఆర్ ఎక్స్ 100' చిత్రంతో టాలీవుడ్‌లో ఓవర్‌నైట్ సంచలనంగా మారిన యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ తన కెరీర్‌లో సరికొత్త అడుగు వేయడానికి సిద్ధమయ్యారు. నటుడిగా పలు వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన ఆయన, ఇప్పుడు మెగాఫోన్ పట్టి దర్శకుడిగా కొత్త అవతారం ఎత్తుతుండటం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉండటంతో సామాజిక మాధ్యమాల్లో వస్తున్న రకరకాల ఊహాగానాలకు, ట్రోలింగ్స్‌కు చెక్ పెడుతూ కార్తికేయ ఈ అనూహ్య నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచారు.

హీరోగా విభిన్నమైన ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆశించిన స్థాయిలో సరైన కంబ్యాక్ లభించకపోవడంతో కార్తికేయ స్వయంగా ఒక పవర్ ఫుల్ కథను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. తన నటనకు, ఆలోచనలకు తగినట్లుగా పూర్తిస్థాయి వైవిధ్యమైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకుని, ఈ సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా స్వీయ నిర్మాణంలోనే ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇటీవల నిశ్శబ్దంగా పూజా కార్యక్రమాలు పూర్తి చేసి సినిమా ముహూర్త వేడుకను కూడా నిర్వహించినట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

సొంత నిర్మాణ సంస్థ 'కార్తికేయ క్రియేటివ్ వర్క్స్' పతాకంపై ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. విశ్వక్ సేన్ వంటి యంగ్ హీరోలు నటనతో పాటు దర్శకత్వ బాధ్యతలు చేపట్టి విజయాలు సాధిస్తున్న తరహాలోనే కార్తికేయ కూడా తనదైన శైలిలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా వెల్లడించి షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడిగా మారి రీఎంట్రీ ఇస్తున్న కార్తికేయ ఈసారి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.