BREAKING
ఆధునిక నవభారత నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏరోసిటీలో ఘనంగా ‘అవెనీర్–2026’ వార్షిక క్రీడోత్సవం మాక్ గ్రామ సభ నిర్వహించిన చిన్నారులకు బహుమతి అందజేసిన సర్పంచ్, ఉప సర్పంచ్ క్రమశిక్షణ పట్టుదల తో లక్ష్యాలు సాధించాలి నెహ్రూ ఘన నివాళి కౌన్సిలర్లకు ఘన సన్మానం నూతన ఎస్సై తిరుపతిని మర్యాదపూర్వకంగా కలిసిన కొడకండ్ల మండల ప్రెస్ క్లబ్ సభ్యులు విశ్రాంతి గది నిర్మాణానికి రూ 10 లక్షలు విరాళం బాలల అభిప్రాయాలకు గౌరవిస్తూ వారి సమస్యలను పరిష్కరిద్దాం ఇమాంపూర్ గ్రామంలో భారీ వాహనాల బీభత్సం బాలాజీ కుటుంబానికి శ్రీ రాజ్య తండా నాయకుల పరామర్శ విద్యార్థులు గ్రంధాలయాలు సద్వినియోగం చేసుకోవాలి అక్రమ పేలుడు పదార్థాలు స్వాధీనం... ఇద్దరిపై కేసు గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం

ధనుష్ మమ్ముట్టి ఓం సినిమా ట్రైలర్ విడుదల.. సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దృశ్యాలు

Select Suryaa Now
ధనుష్ మమ్ముట్టి ఓం సినిమా ట్రైలర్ విడుదల.. సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దృశ్యాలు

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఓం ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో విపరీతమైన స్పందనతో దూసుకుపోతోంది. అమరన్ వంటి భారీ విజయం తర్వాత దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల కీలక పాత్రల్లో కనిపిస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ట్రైలర్ విడుదల ఆలస్యమైనప్పటికీ, వచ్చిన వెంటనే అభిమానుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.  

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉత్కంఠభరితమైన యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ట్రైలర్ దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో ధనుష్ పవర్‌ఫుల్, రా అండ్ ఇంటెన్స్ అవతార్‌లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. మరోవైపు మమ్ముట్టి పాత్ర సైతం ట్రైలర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సాయి పల్లవి యాక్షన్ సన్నివేశాలతో పాటు కథలో కీలక మలుపులకు కారణమయ్యే పాత్రలో కనిపిస్తుండగా, శ్రీలీల ఇతర ప్రధాన పాత్రలతో కలిసి కథా గమనానికి బలాన్ని చేకూరుస్తున్నారు.

వండర్‌బార్ ఫిల్మ్స్ మరియు ఆర్ టేక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం సమకూరుస్తున్నారు. ట్రైలర్‌లో వినిపించిన నేపథ్య సంగీతం యాక్షన్ సన్నివేశాలకు మరింత వేగాన్ని, భావోద్వేగాన్ని జోడించిందని సినీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి. నాసిరుద్దీన్ షా వంటి సీనియర్ నటుడి ఉనికి కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచింది.  

విడుదలైన ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు రెట్టింపు కాగా, ఈ చిత్రాన్ని నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. భారీ తారాగణం, వైవిధ్యమైన కథాంశం కలయికలో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపుతుందోనని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.