BREAKING
నెహ్రూ ఘన నివాళి కౌన్సిలర్లకు ఘన సన్మానం నూతన ఎస్సై తిరుపతిని మర్యాదపూర్వకంగా కలిసిన కొడకండ్ల మండల ప్రెస్ క్లబ్ సభ్యులు విశ్రాంతి గది నిర్మాణానికి రూ 10 లక్షలు విరాళం బాలల అభిప్రాయాలకు గౌరవిస్తూ వారి సమస్యలను పరిష్కరిద్దాం ఇమాంపూర్ గ్రామంలో భారీ వాహనాల బీభత్సం బాలాజీ కుటుంబానికి శ్రీ రాజ్య తండా నాయకుల పరామర్శ విద్యార్థులు గ్రంధాలయాలు సద్వినియోగం చేసుకోవాలి అక్రమ పేలుడు పదార్థాలు స్వాధీనం... ఇద్దరిపై కేసు గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యంగా దోమతెరల పంపిణీ* *- డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఖాజా మౌనద్దీన్*

ఆకాశంలో ఒక తార విడుదల తేదీ ఖరారు.. నవంబర్ 20న థియేటర్లలోకి దుల్కర్ సల్మాన్ చిత్రం

Select Suryaa Now
ఆకాశంలో ఒక తార విడుదల తేదీ ఖరారు.. నవంబర్ 20న థియేటర్లలోకి దుల్కర్ సల్మాన్ చిత్రం

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఆకాశంలో ఒక తార నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భావోద్వేగభరిత కథాంశంతో కూడిన చిత్రంలో సాత్విక వీరవల్లి కథానాయికగా నటిస్తున్నారు. శ్రుతి హాసన్ కీలక పాత్రలో కనిపిస్తుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. తెలుగుతో పాటు మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు.

మహిళా సాధికారత, కలల సాధన నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. సంప్రదాయ కుటుంబ నేపథ్యంలో పెరిగిన యువతి తన ఉన్నత లక్ష్యాలను చేరుకునే క్రమంలో ఎదుర్కొనే సవాళ్లు, ఆ ప్రయాణంలో దుల్కర్ సల్మాన్ పాత్ర ఆమెకు ఎలా అండగా నిలుస్తుందనే అంశాలను హృద్యంగా చూపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

లైట్‌బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, స్వప్న సినిమా మరియు గీతా ఆర్ట్స్ సమర్పిస్తున్నాయి. సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. కథా సన్నివేశాలకు తగ్గట్టుగా పాటలు, నేపథ్య సంగీతాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు సంగీత దర్శకుడు తెలిపారు. సుజిత్ సారంగ్ ఛాయాగ్రహణం అందిస్తుండగా, ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

లక్కీ భాస్కర్ తర్వాత దుల్కర్ సల్మాన్ నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న దుల్కర్ సల్మాన్, పవన్ సాదినేని కాంబినేషన్‌లో వస్తున్న ఆకాశంలో ఒక తార బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందోనని సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.