శర్వానంద్ జార్జ్ క్రిష్ డబ్బింగ్ పనులు షురూ.. 2027 సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: నటుడు శర్వానంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం జార్జ్ క్రిష్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలో దర్శకుడు శ్రీను వైట్లతో పాటు కథానాయిక మానస వారణాసి పాల్గొన్నారు. డబ్బింగ్ ప్రారంభమైన సందర్భంగా మానస వారణాసి తన పాత్రకు స్వయంగా వాయిస్ చెబుతున్న వీడియో ప్రస్తుతం సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది.
ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏటీవీ సమర్పిస్తుండగా, అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ బూస్టర్‌లో శర్వానంద్‌ను రెండు భిన్నమైన మతాలకు చెందిన పాత్రల్లో పరిచయం చేశారు. క్రిస్టియన్‌గా జార్జ్, హిందువుగా క్రిష్ పాత్రల్లో శర్వా కనిపించిన తీరు సినిమాపై ఆసక్తిని పెంచింది. పూర్తిస్థాయి కుటుంబ వినోదాత్మక కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
జార్జ్ క్రిష్ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, కేవీ గుహన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా, అమర్ రెడ్డి కుడుముల ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. నందు సవిరిగాన, గోపీ మోహన్ రచయితలుగా వ్యవహరిస్తుండగా, కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు.
ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. హాస్యం, రొమాన్స్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ మేళవింపుతో ప్రేక్షకులకు పండుగ వినోదాన్ని పంచేందుకు జార్జ్ క్రిష్ సిద్ధమవుతోంది.
Also Read: దిల్జిత్ దొసాంజ్ అహ్మదాబాద్ లైవ్ షోపై ఆంక్షల పిడుగు.. మద్యం, ఆయుధాల పాటలపై అభ్యంతరం!