BREAKING
పూజ కోసం కొమ్మలు కోస్తూ చెరువులో పడి వృద్ధుడు మృతి కీసర ఓఆర్ఆర్ రేడియల్ రోడ్డు లో అక్రమ నిర్మాణాల జోరు...! కాలుష్య రహిత సమాజం కోసం చిన్నారుల బృహత్తర సంకల్పం.. గ్రీన్ వారియర్ అవార్డులతో సత్కారం! ఏఐ, వీఎఫ్ఎక్స్ విమర్శలకు చెక్ పెట్టాలంటే ఇదే మార్గం.. నాగార్జున కీలక సూచన పాత బట్టల గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన బట్టల నిల్వలు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి కాకా సినిమా స్పెషల్ సాంగ్‌లో రితికా సింగ్.. మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్ అల్లు అర్జున్ బోయపాటి కాంబినేషన్‌లో మరో సినిమా.. మైథలాజికల్ కథతో పాన్ ఇండియా ప్రాజెక్ట్? గౌతమ్‌తో ప్రేమకథపై కాజల్ అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. పెళ్లి వెనుక అసలు నిజం ఇదే నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన పోలీసులు కేసరి సీతమ్మ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్సార్‌సీపీ నేతలు భీమవరం విద్యాచరిత్రలో సువర్ణాధ్యాయం ‘విష్ణు విమెన్స్ యూనివర్సిటీ --కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ --మంత్రులు శ్రీనివాస్ వర్మ లోకేష్ కృషితో యూనివర్సిటీ ఏర్పాటు -- అత్యుత్తమ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తాం : చైర్మన్ విష్ణు రాజు పాత వేమవరంలో టీడీపీలోకి జనసేన నాయకుడి చేరిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న మాదల వీరయ్య చౌదరి ఇందిరమ్మ ఇంటి కల సహకారం మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ కమల్ హాసన్‌తో నాటి పుకార్లపై జయసుధ స్పష్టత.. అసలు నిజం బయటపెట్టిన సహజ నటి

ఇట్లు అర్జున సక్సెస్ మీట్.. అనీష్‌పై నాగార్జున ప్రశంసలు, మ్యూజిక్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు

Select Suryaa Now
ఇట్లు అర్జున సక్సెస్ మీట్.. అనీష్‌పై నాగార్జున ప్రశంసలు, మ్యూజిక్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: కింగ్ నాగార్జున సమర్పణలో తెరకెక్కిన ఇట్లు అర్జున చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. అనీష్ హీరోగా పరిచయమైన ఈ సినిమాలో అనస్వర రాజన్ కథానాయికగా నటించగా, మహేష్ ఉప్పల దర్శకుడిగా పరిచయమయ్యారు. దర్శకుడు వెంకీ కుడుముల వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించగా, నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. వేడుకలో మాట్లాడిన నాగార్జున, ఈ వేదిక తనకు ఎంతో నోస్టాల్జిక్‌గా ఉందని, శివ సినిమా పూర్తయిన తర్వాత ఫస్ట్ కాపీని ఇక్కడే చూశామని, అందుకే దీనికి శివ థియేటర్ అని పేరు పెట్టామని గుర్తు చేసుకున్నారు. మాటలు రాని హీరోతో కథను చెప్పడం సులభం కాదని, అలాంటి కథను దర్శకుడు మహేష్ అద్భుతంగా తీశారని ప్రశంసించారు. అనస్వర నటన తనను ఎంతగానో ఆకట్టుకుందని, అనీష్ ఈ సినిమాతో హీరోగా పాసయ్యాడని, అతని విషయంలో గర్వంగా ఉందని నాగార్జున పేర్కొన్నారు. అలాగే సినిమాలోని డీఓపీ రాజా పనితీరు చూసే తన వందో సినిమాకు డీఓపీగా తీసుకున్నానని వెల్లడించారు.

హీరో అనీష్ మాట్లాడుతూ ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమే మొదటి హీరో అని కథ విన్నప్పుడే నమ్మానని, నేడు అందరూ నేపథ్య సంగీతం, పాటల గురించి మాట్లాడుకుంటుండటం సంతోషంగా ఉందని చెప్పారు. క్లైమాక్స్ సమయంలో ప్రేక్షకులు చప్పట్లు కొడుతుంటే తొలి చిత్ర నటుడిగా ఎంతో ఆనందం కలిగిందని, తన నటనకు వచ్చిన ప్రశంసల వెనుక దర్శకుడు మహేష్ ప్రోత్సాహం ఉందని అన్నారు. వెంకీ కుడుముల తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని భావిస్తున్నానని, డీఓపీ రాజా, ఎడిటర్ కోటి, సహనటి అనస్వర, నాగార్జున మద్దతు ఎప్పటికీ మర్చిపోలేనని అనీష్ పేర్కొన్నారు.

సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ ప్రీమియర్స్ నుంచే సినిమాకు మంచి స్పందన కనిపించిందని, తమకు మద్దతుగా నిలిచిన రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు ధన్యవాదాలు తెలిపారు. దర్శకుడు మహేష్ మంచి కథను అందించారని, రాజా విజువల్స్ పెయింటింగ్‌లా ఉన్నాయని, వెంకీ కుడుముల సినిమాకు వెన్నుముకగా నిలిచారని అన్నారు. అనీష్, అనస్వర అద్భుతమైన నటన కనబరిచారని, పాట పాడిన అనిరుద్‌తో పాటు మ్యూజిక్ విభాగం సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాత వెంకీ కుడుముల మాట్లాడుతూ టీమ్ మొత్తం తన నమ్మకాన్ని నిలబెట్టిందని, థియేటర్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తమన్ సంగీతం గురించి ప్రేక్షకులు మాట్లాడుతుండటం ఆనందంగా ఉందని చెప్పారు.

కథానాయిక అనస్వర రాజన్ మాట్లాడుతూ థియేటర్ విజిట్‌లలో ప్రేక్షకుల నుంచి లభించిన స్పందన ఉత్సాహాన్నిచ్చిందని, ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు. తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచిందని, కీర్తి, అర్జున్ పాత్రలకు ఆదరణ దక్కడం సంతోషంగా ఉందని అన్నారు. దర్శకుడు మహేష్ ఉప్పల మాట్లాడుతూ సవాలుతో కూడిన ఈ కథను నమ్మి నిర్మించిన వెంకీ కుడుములకు ధన్యవాదాలు తెలిపారు. అనీష్, అనస్వర, తమన్ సహా చిత్ర బృందం కృషితో సినిమాకు సానుకూల స్పందన వస్తోందని, మంచి కథ, స్క్రీన్‌ప్లే, నటన ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని మరోసారి రుజువైందని మహేష్ పేర్కొన్నారు.