విజయ డంక మోగిస్తాం...!
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : నవంబర్ ఒకటో తేదీ జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూటమి అభ్యర్థులు విజయ డంకం మోగిస్తామని 53వ డివిజన్ టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి శంకర్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో భాగంగా శనివారం శివ జ్యోతి నగర్ లో టిడిపి తిరుమల అధ్యక్షులు సుద్దాల రాజు యాదవ్, 54వ వార్డు అధ్యక్షులు లోకనాథన్ యాదవ్, సెక్రటరీ సుజాత, లోకేష్ నాయుడు, టిడిపి బీసీ నాయకులు జగన్నాథంతో కలసి ఆయన ఇంటిట ప్రచారం చేపట్టారు. అనంతరం ప్రతి ఇంటికి తిరుగుతూ గత ప్రభుత్వ పాలకుల చేసిన అరాచకాలను ప్రజలకు వివరిస్తూ కూటమి ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెలియజేశారు. ఒక్క అవకాశం కల్పించండి మీ బిడ్డగా అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని భరోసా ఇచ్చారు. డివిజన్లో కాలువలు డ్రైనేజీ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు. జరగబోయే కార్పొరేషన్ ఎన్నికలలో కూటమి తరపున మేయర్ అభ్యర్థిగా జేబీ శ్రీనివాస్, 53వ డివిజన్ కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న (శంకర్ యాదవ్) తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరి ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కిరణ్ చౌదరి, ప్రవీణ్, సందీప్, దినేష్, అనిల్, నాయిడమ్మ, చావ మహేష్, అయ్యప్ప కాలనీ సుబ్బు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్