BREAKING
ఊర పందుల దాడిలో వృద్ధురాలు మృతి కొనరావుపేటలో భూముల రీసర్వే కు రైతులుఅదనపు కలెక్టర్ గడ్డం నగేష్ బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ విధ్వంసం.. ఏకంగా సలార్, సుల్తాన్ రికార్డులను అధిగమించిన జైలర్ 2 వివాదంపై స్పందించిన నటుడు మనోజ్ బాజ్‌పాయ్.. కుటుంబంపై ట్రోలింగ్ జరిగితే ఎంతగా కుంగిపోయానో చెప్పిన వైనం రూ.18.70 కోట్ల నిధులపై సమగ్ర విచారణ జరపాలి - సిపిఎం ఫౌజీ టీజర్ గూస్‌బంప్స్.. భగవద్గీత కోడ్‌తో బ్రిటీషర్లపై విరుచుకుపడనున్న సూపర్ స్పై ప్రభాస్ అర్హులైన ప్రతి కూలీకి పని కల్పించాలి : ఎంపీడీవో కృష్ణవేణి టిడిపి 40 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నాగే జానకమ్మ విస్తృత ప్రచారం ఫాక్స్ సంస్థ ఏఐ షోపై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం.. చెత్త కంటెంట్‌గా విమర్శలు కేజీబీవీలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..ఆవరణలో వసతుల పరిశీలన సౌరవ్ గంగూలీ లార్డ్స్ సెలబ్రేషన్స్ స్ఫూర్తితో.. అభిలయ్ డియో మోస్ట్ అవేటెడ్ మూవీ దూస్ర ది లామెంట్ ఆఫ్ ఆటం.. రెడ్ ఫ్లాగ్ హీరో, తిరుగుబాటు హీరోయిన్‌తో పాలిటిక్స్ డ్రామా సూర్య కథనంతో వెలుగులు నింపుకున్న అంగడి చౌరస్తా..! జైలర్ 2 బాక్సాఫీస్ విధ్వంసం.. 9వ రోజు కలెక్షన్లతో బోర్డర్ 2 రికార్డులు బ్రేక్ రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా నివాసంలో కలిసిన కాట శ్రీనివాస్ గౌడ్, నీలం మధు

36వ వార్డులో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) ఇంటింటి ప్రచారం

Select Suryaa Now
36వ వార్డులో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య)  ఇంటింటి ప్రచారం

36వ వార్డులో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య)  ఇంటింటి ప్రచారం

జగ్గయ్యపేట మేజర్ న్యూస్ : జగ్గయ్యపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శ్రీమతి నరేంద్రుల వినీత విజయాన్ని, అలాగే పట్టణంలోని 36వ వార్డు కూటమి బలపరిచిన అభ్యర్థి శ్రీమతి చావా సునీత  విజయాన్ని కాంక్షిస్తూ, శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య  36వ వార్డులో విస్తృతంగా పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను శ్రద్ధగా విని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఒక్కరికీ వివరించారు.

జగ్గయ్యపేట పట్టణ సమగ్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని, అందుకు మున్సిపాలిటీలో కూడా కూటమి అభ్యర్థులు గెలవడం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు తమ అమూల్యమైన ఓటును వినియోగించుకుని, కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరారు.

వార్డు ప్రజలు కూడా ఎమ్మెల్యేకు ఆత్మీయ స్వాగతం పలికి, కూటమి అభ్యర్థులకు తమ పూర్తి మద్దతును తెలియజేశారు. ప్రచారం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తరఫున గట్టేటి ప్రసాద్, గింజుపల్లి కృష్ణ, గుత్తా సురేష్; జనసేన పార్టీ తరఫున ఈమని కిషోర్, మోసిన్; బీజేపీ తరఫున మన్నే శ్రీనివాసరావు తదితరులతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.

 

 

 

 

రిపోర్టర్ :-శివా జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా