టిడిపి 40 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నాగే జానకమ్మ విస్తృత ప్రచారం
కదిరి మున్సిపల్ పరిధిలోని 40 వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి నాగే జానకమ్మ, టీడీపీ నాయకులు నాగే నరసింహులు వార్డు పరిధిలో శనివారం విస్తృత ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. వార్డులో ని ప్రతి ఇంటికి వెళ్లి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను కౌన్సిలర్ గా గెలిపించా లని ఓటర్లను అభ్యర్థించారు. అలాగే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి అర్షియా భాను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వార్డు పరిధిలో విస్తృత ప్రచారం నిర్వహిం చగా ఓటర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పట్టణ అభివృద్ధి చేస్తున్న కృషిని వివరించారు. తాను కౌన్సిలర్ గా ఎన్ని కైతే చేపట్టబోయే అభివృద్ధిని ప్రజలకు వివరించినట్లు తెలియ జేశారు. వాటిలోని ప్రతి వీధికి సిమెంట్ రోడ్డు వేయిస్తామని, తాగునీటి సమస్య లేకుండా చేస్తామ న్నారు. ఈ కార్య క్రమంలో టిడిపి నాయకులు నాగే నరసింహులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.