ప్రచారంలో దూసుకుపోతున్న సిపిఐ పార్టీ 37వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఎస్.కె సబిహా
కదిరి మున్సిపల్ పరిధిలోని వైఎస్ఆ ర్సిపి పార్టీ మద్దతుతో సిపిఐ పార్టీ 37వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఎస్.కె సబిహా ప్రచార కార్య క్రమంలో దూసుకు పోతున్నారు. 37 వార్డులో గత మూడు రోజులుగా విస్తృత ప్రచారం చేస్తూ అన్ని పార్టీల కంటే ముందే ప్రచారాన్ని వేగవంతం చేశారు. సిపిఐ పార్టీ గుర్తు అయిన కంకి కొడవలి గుర్తుకు ఓటు వేసి తనను కౌన్సిలర్ గా గెలి పించాలని.. అలాగే వైఎస్ఆర్సిపి మున్సి పల్ చైర్మన్ అభ్యర్థి అత్తర్ పర్వీన్ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు అభ్యర్థిం చారు. వార్డు పరిధి లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తు న్నామని ప్రజల నుంచి సైతం మంచి స్పందన లభిస్తోం దని తెలియజేశారు. తాను కౌన్సిలర్ గా ఎన్నికైతే చేపట్ట బోయే అభివృద్ధి పనులు వార్డు ప్రజల సమస్యల పరిష్కా రం ఓటర్లకు వివరిస్తూ ప్రచార కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు కౌన్సిలర్ అభ్యర్థి సబిహా తెలియ జేశారు. ఈ కార్య క్రమంలో సిపిఐ నాయకులు లియాఖత్ అలీ, ఇతర నాయకులు పాల్గొన్నారు.