మంగాదేవికి డాక్టరేట్ ప్రధానం
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పరిశోధన విద్యార్థిని సి.హెచ్.మంగాదేవికి డాక్టరేట్ ప్రదానం చేసినట్లు డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కె.అనురాధ తెలిపారు. ఈమె విశ్రాంత ప్రొఫెసర్ సంత్రాణి ఠాకూర్ మార్గదర్శకత్వంలో ప్రొఫెసర్ కె.స్వాతి సహ-మార్గదర్శకత్వంలో “న్యూరోప్రొటెక్టివ్ ఎఫెక్ట్ ఆఫ్ సమ్ సెలెక్టెడ్ ఫైటోకెమికల్స్ ఎగైనెస్ట్ సెరిబ్రల్ ఇస్కీమియా రీపర్ఫ్యూజన్ ఇంజ్యూరీ” అనే అంశంపై పరిశోధన గ్రంథాన్ని సమర్పించారు. ఇందుకుగాను మంగాదేవికి డాక్టరేట్ ప్రదానం చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమెకు డాక్టరేట్ రావడం పట్ల ప్రొఫెసర్లు ఆచార్యులు పరిశోధకులు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్